E-Paper
Advertisement

Actor Ajith Kumar: ‘ జెంటిల్ మెన్  డ్రైవర్ అఫ్ ది ఇయర్’గా  హీరో అజిత్ .. అరుదైన గౌరవం అందుకున్న హీరో!

Actor Ajith Kumar: ‘ జెంటిల్ మెన్  డ్రైవర్ అఫ్ ది ఇయర్’గా  హీరో అజిత్ .. అరుదైన గౌరవం అందుకున్న హీరో!
Advertisement

Actor Ajith Kumar: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అజిత్ కుమార్(Ajith Kumar) ఒకరు. ఈయన సినిమాల పరంగా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సినిమాలతో పాటు అజిత్ కు రేసింగ్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రేసింగ్ పోటీలలో పాల్గొంటూ ఇప్పటికే ఎన్నో పథకాలను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా నిత్యం కార్ రేస్ పోటీలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

ఫిలిప్ చారియోల్ మోటార్ స్పోర్ట్స్ గ్రూప్ ..

ఇకపోతే తాజాగా నటుడు అజిత్ కుమార్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రొఫెషనల్ రేసర్ గా అజిత్ కుమార్ ఎన్నో విజయాలను సాధించిన నేపథ్యంలో ఈయనకు “జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025″(Gentleman driver of the year 2025)అవార్డుతో సత్కరించారు. ఇటలీలోని వెనిస్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అజిత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వేడుకలో ఫిలిప్ చారియోల్ మోటార్ స్పోర్ట్స్ గ్రూప్ ఈ అవార్డును అజిత్ కు అందించింది. ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఆయన భార్య పిల్లలు కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను అజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

ఫిలిప్ చార్రియోల్ గౌరవార్థం..

Advertisement

నటుడు అజిత్ కుమార్ ఈ విధమైనటువంటి అవార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను శాలిని(Shalini) కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్తకు దక్కిన ఈ గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాలిని స్పందిస్తూ.. వెనిస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నా భర్త పక్కన నిలబడటం చాలా గర్వంగా అనిపించిందని తెలిపారు.రేసింగ్ డ్రైవర్ దివంగత ఫిలిప్ చార్రియోల్(Philippe Charriol) గౌరవార్థం తన భర్తకు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ 2025 అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

ఇలా అజిత్ కుమార్ కు ఈ విధమైనటువంటి అవార్డు రావడంతో ఆయన కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. ఫిలిప్ చార్రియోల్ గుర్తుగా ఈ అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందని, చార్రియోల్ గురించి తాను చాలా గొప్పగా విన్నానని, ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని అజిత్ తెలిపారు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన ఈ రేసింగ్ భాగంగా ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకోవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Spirit pooja Ceremony: హమ్మయ్య స్పిరిట్ మొత్తానికి స్టార్ట్.. మెగాస్టార్ చేతుల మీదుగా..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×