Akhil Akkineni:అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)- అక్కినేని అమల (Akkineni Amala) దంపతుల ఏకైక వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni). గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం తెగ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పోరాటానికి తెరదించుతూ.. ఆయన పడ్డ కష్టానికి లెనిన్ రూపంలో సరైన సక్సెస్ లభించింది. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.64 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి.. రూ.100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది ఈ సినిమా. తన కెరియర్లో అందుకున్న బ్లాక్ బస్టర్ విజయానికి ప్రతీకగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు అఖిల్. అందులో భాగంగానే తాను ఏ దేశ పౌరుడో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన మాటలు విన్న అభిమానులు ఏంటి అఖిల్ భారతీయుడు కాదా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
also read:నీట్ పేపర్ లీక్ వివాదంపై నవదీప్ షాకింగ్ రియాక్షన్?
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లెనిన్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్.. తన పౌరసత్వంపై స్పందించారు. వాస్తవానికి.. 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ జోస్ నగరంలో అఖిల్ జన్మించారు. అయితే అక్కడి చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించడంతో అఖిల్ కి అమెరికా పౌరసత్వం లభించింది. అయితే ఇప్పుడు అమెరికా పౌరసత్వంపై కాస్త ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. పైగా ఆయనకు అమెరికా పాస్ పోర్ట్ కూడా లభించింది.
కానీ అఖిల్ చిన్నప్పటి నుంచి ఇండియాలోనే పెరిగాడు. తన విద్యలో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్లోనే పూర్తి చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో కూడా చదువుకున్న ఈయన నటన మీద ఆసక్తితోనే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నటనలో శిక్షణ పొందాడు. అయితే ఇప్పుడు పాల్గొన్న పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మీరు అమెరికన్ సిటిజనా? లేక ఇండియన్ సిటిజనా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. “నేను ప్రస్తుతానికి భారతీయుడిని కాదు… అమెరికన్ పౌరుడినే.. నా దగ్గర అమెరికా పాస్ పోర్ట్ కూడా ఉంది. అయితే ఆ పౌరసత్వాన్ని వదులుకొని కొన్ని నెలల్లో పూర్తిగా భారతీయుడిని అవుతాను” అని చెప్పారు. ఇక చివరిగా ..” నేను మాత్రం ఇండియన్.. మేరా భారత్ మహాన్” అంటూ తాను భారతీయుడినే అంటూ చెప్పుకొచ్చారు. అయితే పౌరసత్వం పై ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇదే పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఏజెంట్ సినిమా గురించి మాట్లాడుతూ..” ఏజెంట్ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలలో నన్ను నేను చూసుకున్నప్పుడు కాస్త అతి చేశానేమో అనిపించింది” అంటూ ఏజెంట్ ఫ్లాప్ పై కూడా స్పందించారు అఖిల్. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ జెన్యూన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.