E-Paper
Advertisement

బట్టలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడి నీళ్లతో ఉతకాలా? చల్లటి నీళ్లతోనా?

బట్టలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడి నీళ్లతో ఉతకాలా? చల్లటి నీళ్లతోనా?
Advertisement

Hot Water vs Cold Water: చాలామందికి రోజూ బట్టలు ఉతికేటప్పుడు ఒక కామన్ డౌట్ వస్తుంటుంది. అదే.. వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసినప్పుడు వేడినీళ్లు వాడితే మంచిదా లేక చల్లటి నీళ్లతో ఉతికితే బట్టలు బాగా శుభ్రమవుతాయా అని ఆలోచిస్తుంటారు. అయితే చాలాకాలంగా వేడి నీళ్లతోనే మురికి బాగా వదులుతుందనే నమ్మకం కొందరిలో ఉండేది. కానీ ఇప్పటి ఆధునిక డిటర్జెంట్లు వచ్చాక.. నిపుణులు చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందుగా దుస్తుల ఎక్కువ రోజులు మన్నిక రావాలంటే, విద్యుత్ ఆదా చేయాలంటే బట్టలు ఉతకడానికి ఏ నీటిని వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చల్లటి నీళ్లు ఎప్పుడు వాడాలంటే?

మనం నిత్యం వేసుకునే దుస్తులకు చల్లటి నీళ్లే సరిపోతాయి. బట్టల రంగులు వెలిసిపోకుండా ఉండటానికి, దుస్తుల ఆకారం మారకుండా కాపాడటానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కాటన్, ఉన్ని, అలాగే సింథటిక్ దుస్తులను చల్లటి నీళ్లతో ఉతికితే అవి ఎక్కువ కాలం కొత్తవిగా ఉంటాయి. అంతేకాకుండా.. వాషింగ్ మెషీన్ నీటిని వేడి చేయడానికి వాడే విద్యుత్ ఆదా అవుతుంది కాబట్టి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

Advertisement

Also Read: మీ ఏరియాలో Airtel బ్రాడ్‌బ్యాండ్ ఉందో? లేదో? 2 నిమిషాల్లో చెక్ చేసుకోండిలా..

ఆధునిక డిటర్జెంట్‌లతో పని సులభం:

పూర్వం డిటర్జెంట్ పొడులు కరగడానికి వేడి నీళ్లు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే చాలా డిటర్జెంట్లు చల్లటి నీటిలో కూడా త్వరగా కరిగిపోతాయి. మురికిని, సాధారణ మరకలను తొలగించడంలో ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే ప్రతిరోజూ వాడే దుస్తులకు ప్రత్యేకంగా వేడి నీళ్లు వాడాల్సిన పని లేదు.

వేడినీళ్లు ఎప్పుడు వాడాలి?

Advertisement

అన్ని వేళలా చల్లటి నీళ్లే వాడకూడదు. కొన్ని పరిస్థితుల్లో వేడి నీళ్లు కూడా వాడాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు వాడిన బట్టలు, టవళ్లు, బెడ్‌షీట్లు ఉతికేందుకు వేడి నీళ్లు చాలా అవసరం. సూక్ష్మజీవులు నశించాలంటే వేడి నీటితో పాటు బాగా ఆరబెట్టడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మొండి మరకల కోసం:

ఇంట్లోని సాధారణ దుస్తులకు చల్లటి నీళ్లతో ఉతకడమే ఉత్తమమైన మార్గం. ఇది దుస్తుల రంగును, నాణ్యతను కాపాడటమే కాకుండా.. శక్తిని కూడా ఆదా చేస్తుంది. అయితే ఇంట్లో జబ్బుపడిన వారి బట్టలు, బాగా మురికిపట్టిన దుస్తుల విషయానికి వస్తే మాత్రం వేడి నీళ్లను వాడటమే సరైన పద్ధతి. మనం ఉతికే దుస్తుల రకం, వాటిపై ఉండే సూచనల ఆధారంగా నీటి ఉష్ణోగ్రతను ఎంచుకుంటే బట్టలు ఎక్కువ రోజులు మన్నుతాయి.

Also Read: Nubia NaviX Ultra ఫస్ట్ లుక్ చూశారా? 50MP కెమెరా, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లతో దుమ్మురేపనుంది!

Related News

ప్రేమ, పెళ్లి ప్రాధాన్యం కాదు.. ఈ తేదీల్లో పుట్టినవారికి కెరీర్ విజయమే ముఖ్యం

మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఇది ఆ సమస్యలకు సంకేతం

పాలు తాగేటప్పుడు ఈ ఆహారాలు తినకూడదు.. ఆరోగ్యానికి ప్రమాదకరం

మార్కెట్లో ఖరీదైన కస్టర్డ్ పౌడర్ ఎందుకు కొనడం? కిచెన్‌లో లభించే ఈ 3 పదార్థాలతో చేసేయండి

భార్య ఎక్కువ సంపాదిస్తే సంబంధాలపై ప్రభావం ఉంటుందా? తాజా అధ్యయనంలో తేలింది ఇదే

ఖరీదైన డిజైనర్ చీరను ఎలా ఉతకాలి? డ్యామేజ్ కాకుండా ఈజీగా ఇలా క్లీన్ చేయండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ సూప్ తాగితే అద్భుత ఫలితాలు

Big Stories

Advertisement
×