Navdeep:ప్రముఖ సినీ నటుడు నవదీప్(Navdeep )తెలుగు,తమిళ్, కన్నడ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నటనతోనే కాదు సోషల్ మీడియాలో చేసే అనుచిత వ్యాఖ్యలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఇరుక్కొని వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వివాదంపై ఊహించని రియాక్షన్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు నెటిజన్స్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీ కేంద్రంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు అందరినీ ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ పేపర్ లీక్ కారణంగా కొంతమంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులకు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు అండగా నిలుస్తూ.. పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుండి ముంబై, కేరళ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా నిరసనలు మొదలయ్యాయి. విద్యార్థులు నిరసనలు చేపడుతూ ధర్మేంద్ర రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా విద్యార్థులకు అండగా ధర్మేంద్ర రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ధర్మేంద్ర రాజీనామా చేశారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తాజాగా స్టూడెంట్స్ ఇష్యూపై నవదీప్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
also read:అమల అక్కినేని ‘బ్లూ క్రాస్’ ఆరంభం వెనుక నిజాలు బయటపెట్టిన అఖిల్!
ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల నిరసనపై నవదీప్ స్పందించిన తీరు నెట్టింట చర్చకు దారి తీసింది. ఆయన మాట్లాడుతూ..” ప్రభుత్వానిది తప్పంటే యాంటీ-నేషనలిస్ట్ అంటారు. స్టూడెంట్స్ ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. పోలీసులను ముందే స్టూడెంట్స్ కొట్టారు అంటారు. కాదు మేము సైలెంట్ గా ఉంటే పోలీసులే కొట్టారు అంటారు. ఒపీనియన్ చెబితే నీకేం తెలుసు అంటారు. చెప్పకపోతే నువ్వేం చేయలేదు.. ఎందుకు అంటారు.. చాలా కష్టం వచ్చి పడింది.. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి.. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, డెమోక్రసీ అంటే ఏమిటి? ఏం చేసినా.. ఏం చేయకపోయినా కష్టమే” అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం నవదీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇకపోతే నవదీప్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో చాలామంది నవదీప్ చేసిన కామెంట్స్ కి మద్దతు పలుకుతున్నారు. తప్పును తప్పు అని నిలదీసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అభిప్రాయాలు చెప్పిన ప్రతి ఒక్కరిని విమర్శించడం సరైన పద్ధతి కాదు.. విద్యార్థులు న్యాయం కోసం పోరాడుతున్నారు. తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.. దీనిపై భయం లేకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన నవదీప్ ధైర్యాన్ని అభినందిస్తున్నారు. మరికొంతమంది నవదీప్ ఈ సమయంలో ఇలా ప్రశ్నించిన తీరు సరైనదేనా? అంటూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
స్టూడెంట్స్ ఇష్యూపై నవదీప్ రియాక్షన్ వైరల్..
నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనపై నటుడు నవదీప్ స్పందించిన తీరు నెట్టింట వైరలవుతోంది. ‘‘ప్రభుత్వానిది తప్పంటే యాంటీ-నేషనలిస్ట్ అంటారు. స్టూడెంట్స్ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒపీనియన్ చెబితే నీకేం తెలుసు అంటారు.… pic.twitter.com/FpMkCAgKXZ
— BIG TV Cinema (@BigtvCinema) July 25, 2026