E-Paper
Advertisement

Actor Shivaji: వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. ఇక ఆపండి చాలు: శివాజీ

Actor Shivaji: వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. ఇక ఆపండి చాలు: శివాజీ

Actor Shivaji: శివాజీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శివాజీ (Shivaji)తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈయన మురళి కాంత్ దర్శకత్వంలో తెరికెక్కిన దండోరా(Dandora) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతూ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది..

వివాదానికి చెక్ పెట్టిన శివాజీ?

ఈ సినిమా కారణంగా నటుడు శివాజీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన హీరోయిన్ల వస్త్రధారణ గురించి కాస్త అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన నేపథ్యంలో వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయం పై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ శివాజీకి కౌంటర్ ఇవ్వగా మరికొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇక ఈ విషయంపై పెద్ద ఎత్తున డిబేట్లు కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా దండోరా సినిమాపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో శివాజీ ఈ విషయంపై మరోసారి స్పందించారు. తాజాగా దండోరా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డిబేట్ లను ఆపేయండి..

ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శివాజీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి ఈ వివాదం గురించి ప్రశ్నలు ఎదురవడంతో శివాజీ మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఇంకా డిబేట్ లు కొనసాగుతూనే ఉన్నాయని, వాటిని ఇంతటితో ఆపేయాలని ఈయన అందరిని వేడుకున్నారు. ప్లీజ్ నా వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళకండి వాటి గురించి కాకుండా దండోరా సినిమాని ప్రమోట్ చేయండి అని తెలిపారు. ఇలా సినిమాని ప్రమోట్ చేయకపోతే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది కావాలంటే నేను థియేటర్ కు వస్తాను ఏం మాట్లాడాలన్నా నేను అక్కడ మాట్లాడుతానని తెలిపారు.

వ్యక్తిగత విషయాలు వద్దు..

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే మాట్లాడండి నా వ్యక్తిగత విషయాలకు సంబంధించి మరోసారి అందరం కలిసి మాట్లాడుకుందాం అంటూ శివాజీ ఈ సందర్భంగా మీడియా వారిని కోరారు.. మరి శివాజీ చేసిన ఈ రిక్వెస్ట్ మేరకు ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పడుతుందా లేదంటే వివాదం ఇలాగే కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయంపై అనసూయ తీవ్రస్థాయిలో స్పందిస్తూ శివాజీపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అనసూయకు మద్దతు నిలబడగా మరికొందరు అనసూయ పై కూడా విమర్శలు చేస్తున్నారు. శివాజీ మాట్లాడిన మాటలు నిజమే కానీ ఆయన మాట్లాడిన విధానం తప్పుగా ఉందంటూ మరి కొందరు ఈ వివాదంపై స్పందించారు.

Also Read: Raju Gaari Pelli Ro: అనగనగా ఒక రాజు నుంచి రాజు గారి పెళ్లి రో ఫుల్ సాంగ్ రిలీజ్!

Related News

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

Big Stories

×