E-Paper
Advertisement

AUS Vs ENG 4th Test : పిచ్‌లో 10 మిమీల గడ్డి.. 131 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్..!

AUS Vs ENG 4th Test : పిచ్‌లో 10 మిమీల గడ్డి..  131 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్..!

AUS Vs ENG 4th Test : బాక్సింగ్ డే రోజున మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఎవ్వ‌రూ ఊహించ‌నిది జ‌రిగింది. ఈ చారిత్రాత్మ‌క మైదానంలో సాధార‌ణంగా ప‌రుగులు వ‌ర‌ద‌లా పారుతుంటాయి. కానీ ఇంగ్లండ్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన నాలుగో యాషెస్ టెస్ట్ లో మెల్ బోర్న్ పిచ్ బ్యాట్స్ మెన్ కి స్మ‌శాన వాటిక‌గా నిరూపిత‌మైంది. మెల్ బోర్న్ టెస్ట్ తొలిరోజు కేవ‌లం 75.1 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశారు. ఈ స‌మ‌యంలోనే ఒక్క‌రోజులేనే 20 వికెట్లు ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఆస్ట్రేలియా జ‌ట్టు కేవ‌లం 152 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ 110 ప‌రుగుల‌కు లొంగిపోయింది. మెల్ బోర్న్ లో తొలిరోజు 20 వికెట్లు కోల్పోవ‌డంతో 131 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన‌ట్టు అయింది.

Also Read : MICT vs DSG: SA 20 సీజన్ 4 షురూ.. ఈ మ్యాచ్ లు ఉచితంగా ఎక్కడ చూడాలంటే

హ్యారీ బ్రూక్ 41 ప‌రుగులే అత్య‌ధిక స్కోర్

మెల్ బోర్న్ టెస్ట్ తొలిరోజున 94, 119 మంది ప్రేక్ష‌కులు స్టేడియానికి వ‌చ్చారు. ఇంగ్లండ్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు వారి ముందు లొంగిపోయారు. మెల్ బోర్న్ పిచ్ బ్యాట్స్ మెన్స్ మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్టంగా మారింది. వారిలో ఎవ్వ‌రూ హాఫ్ సెంచరీ చేయ‌లేదు. హ్యారీ బ్రూక్ 41 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. 13 మంది బ్యాట్స్ మెన్స్ రెండు అంకెల స్కోరును చేరుకోలేక‌పోయారు. మెల్ బోర్న్ మైదానంలో తొలిరోజు చివ‌రిసారి 20 వికెట్లు ప‌డిపోయాయ‌ని గ‌మ‌నించాలి. ఆ స‌మ‌యంలో కేవ‌లం 198 ప‌రుగుల‌కే 20 వికెట్లు ప‌డ్డాయి. మెల్‌బోర్న్ పిచ్‌పై 10 మిల్లీమీటర్ల గడ్డి మిగిలి ఉందని తెలిస్తే.. అంద‌రూ ఆశ్చర్యపోతారు. కానీ ఇది మునుపటి మ్యాచ్ కంటే 2-3 మిల్లీమీటర్లు ఎక్కువ. ఈ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు కొనసాగింది. అయితే ఈసారి మెల్‌బోర్న్ క్యూరేటర్ కేవలం 10 మిల్లీమీటర్ల గడ్డిని మాత్రమే మిగిల్చారు. ఆస్ట్రేలియన్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లలోని టాప్ నలుగురు బ్యాట్స్‌మెన్‌ల ఉత్తమ స్కోరు కేవలం 13 పరుగులు. మాజీ క్రికెటర్ మార్క్ వా మెల్‌బోర్న్ పిచ్‌తో ఆకట్టుకోలేదు. ఈసారి అది బౌలర్లకు అనుకూలంగా ఉందని ఆయన అన్నారు.

పిచ్‌లో 10 మిమీల గడ్డి..

మార్క్ వా ఓ మీడియా ఛాన‌ల్ తో మాట్లాడుతూ “నేను బ్యాట్, బంతి మ‌ధ్య యుద్ధాన్ని చూడాల‌నుకుంటున్నాను. కానీ ఈ పిచ్ బౌల‌ర్ల‌కు ఎక్కువ‌గా అనుకూలంగా ఉంద‌ని నేను భావించాను. పిచ్ పై గ‌డ్డి చాలా ఉంది. బంతి రెండు వేర్వేరు వేగంతో వ‌స్తోంది. బ్యాట్స్ మెన్ ఇది చాలా క‌ష్టంగా ఉంది” అని చెప్పారు. మొత్తానికి బాక్సింగ్ డే రోజు 20 వికెట్లు కోల్పోవ‌డం ఇరు జ‌ట్ల బ్యాట‌ర్ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి అనే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌లేదు. ఇక మ్యాచ్ కూడా చాలా ట‌ఫ్ గానే ఉంది. ఆస్ట్రేలియా జ‌ట్టు క్లీన్ స్వీప్ చేస్తుందా..? కేవ‌లం సిరీస్ మాత్ర‌మే స్వాధీనం చేసుకుంటుందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read : Vijay hazare trophy: రింకూ సింగ్ అద్భుత సెంచరీ.. సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేసినట్టేనా?

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×