E-Paper
Advertisement

Raju Gaari Pelli Ro: అనగనగా ఒక రాజు నుంచి రాజు గారి పెళ్లి రో ఫుల్ సాంగ్ రిలీజ్!

Raju Gaari Pelli Ro: అనగనగా ఒక రాజు నుంచి రాజు గారి పెళ్లి రో ఫుల్ సాంగ్ రిలీజ్!
Advertisement

Raju Gaari Pelli Ro: నవీన్ పోలిశెట్టి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్టాండప్ కమెడియన్ గా మొదలైన ఈయన ప్రయాణం ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈయన చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

రాజు గారి పెళ్లి రో సాంగ్..

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ వంశీ ,సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించక నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా తాజాగా “రాజు గారి పెళ్లి రో”(Raju Gaari Pelli Ro)అంటూ సాగిపోయే ఒక వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.

Advertisement

లిరిక్స్ అందించిన చంద్రబోస్ ..

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి లుక్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి “భీమవరం బల్మా” అంటూ సాగిపోయే పాటను విడుదల చేయగా, ఈ పాట సినిమా పట్ల మంచి అంచనాలను పెంచింది. ఇక తాజాగా వెడ్డింగ్ థీమ్ తో రాజుగారి పెళ్లి రో అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నవీన్ పోలీస్ శెట్టికి అనగనగా ఒక రాజు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమా ద్వారా రాబోతున్నారు. మరి ఈ సినిమా ఈ మీనాక్షి చౌదరికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read; Allu Ayaan: మరోసారి ట్రెండింగ్ లో అల్లు అయాన్.. క్రిస్మస్ రీల్ తో రచ్చ రచ్చ..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×