E-Paper
Advertisement

9000mAh భారీ బ్యాటరీతో రంగంలోకి OnePlus Nord 6.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!

9000mAh భారీ బ్యాటరీతో రంగంలోకి OnePlus Nord 6.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!
Advertisement

OnePlus Nord 6: మధ్యతరగతి యూజర్లను ఆకట్టుకునేలా.. తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లు అందించే స్మార్ట్‌ఫోన్ ఏదైనా ఉందంటే అది వన్‌ప్లస్. మన దేశంలో ఈ ఫోన్లకు ఉన్న క్రేజ్ కూడా ఎక్కువే. ఇప్పుడు వన్‌ప్లస్ లేటెస్ట్ మోడల్ ‘OnePlus Nord 6’ను ఈరోజే మార్కెట్లోకి వదులుతోంది. గతంలో వచ్చిన Nord 5కి మంచి క్రేజ్ రావడంతో, ఇప్పుడు రాబోతున్న Nord 6పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే కంపెనీ రిలీజ్ చేసిన కొన్ని టీజర్లు చూస్తుంటే.. ఈసారి ఫోన్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది.

ధర ఎంత ఉండొచ్చు?

ఈ OnePlus Nord 6 ధర రూ.35,000 నుండి రూ.40,000 మధ్యలో ఉండొచ్చని టాక్. OnePlus 15R కంటే కొంచెం తక్కువ ధరకే ఇది మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. ఫ్రెష్ మింట్, హోలోగ్రాఫిక్ క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి.

Advertisement

Also Read: క్యాసియో నుంచి మరో క్రేజీ వాచ్ లాంచ్.. తక్కువ బడ్జెట్‌లో పదేళ్ల బ్యాటరీ బ్యాకప్‌‌ పక్కా!

పెర్ఫార్మెన్స్‌లో తోపు..

ఇక ఈ ఫోన్ స్క్రీన్ విషయానికి వస్తే.. దీనిలో 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి తోడు 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్పీడ్‌గా, స్మూత్‌గా అనిపిస్తుంది. బయట ఎండలో చూసినా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా హై బ్రైట్‌నెస్‌ను కూడా యాడ్ చేశారు. ఇక లోపల పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు గానీ, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు గానీ ఫోన్ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతుంది. పాత మోడల్స్‌తో పోలిస్తే దీని వేగం చాలా రెట్లు పెరిగిందని కంపెనీ గట్టిగా చెబుతోంది.

కెమెరా క్వాలిటీ అదుర్స్..

Advertisement

OnePlus Nord 6 ఫోన్ వెనుక వైపు 50MP సోనీ లైటియా మెయిన్ కెమెరాను ఇచ్చారు. ఇది ఫొటోలను చాలా నేచురల్‌గా, స్పష్టంగా తీస్తుంది. ఇక సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనిలో ఏకంగా 9,000mAh బ్యాటరీ ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఇక ఛార్జింగ్ గురించి బెంగ అక్కర్లేదు. దానికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో ఫోన్ నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోతుంది. నీళ్లు, దుమ్ము లోపలికి వెళ్లకుండా గట్టి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కావాలనుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ 6 మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: రూ.20,000 బడ్జెట్‌లో రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్.. Note 15కి Note15 SEకి ఉన్న తేడా ఇదే!

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×