Lokah 2: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)ప్రస్తుతం కాంత(Kaantha) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. భాగ్యశ్రీ, దుల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ ఇటీవల ఆయన నిర్మాతగా వ్యవహరించిన లోక సినిమా (Lokah)గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ఆగస్టు 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంత సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా సీక్వెల్ గురించి దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లోక బడ్జెట్ ముందుగా మేము అనుకున్న దానికంటే కూడా రెండింతలు ఎక్కువగా అయిందని తెలిపారు. అయితే బడ్జెట్ గురించి నాన్నకు చెప్పడంతో చాలా టెన్షన్ పడ్డారని, భయపడినట్టు కాకుండా ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చాయని దుల్కర్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో కూడా నాన్నను (మమ్ముట్టి) భాగం చేయాలని భావించాను కానీ మొదట నన్ను నేను నిరూపించుకోవడం కోసం మొదటి భాగంలో నాన్నను తీసుకురాలేదు కానీ రెండో భాగంలో మాత్రం కచ్చితంగా నాన్న నటిస్తారు అంటూ దుల్కర్ సల్మాన్ లోక సీక్వెల్ సినిమాలో మమ్ముట్టి (Mammootty) నటించబోతున్నారని విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తన కెరియర్ ప్రారంభించి 14 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ 14 సంవత్సరాల కాలంలో మొదటిసారి నాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని, ఈ విషయంలో నాకు ఎంతో గర్వంగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలుగులో భారీ క్రేజ్..
ఇలా ఒక స్టార్ హీరో వారసుడిగా దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. కేవలం మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో దుల్కర్ నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలోనే కాంత అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమాకు రానా నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Also Read: Spirit -Chiranjeevi: స్పిరిట్ సినిమాలో చిరు.. కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన సందీప్ రెడ్డి!