E-Paper
Advertisement

Spirit -Chiranjeevi: స్పిరిట్ సినిమాలో చిరు.. కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన సందీప్ రెడ్డి!

Spirit -Chiranjeevi: స్పిరిట్ సినిమాలో చిరు.. కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన సందీప్ రెడ్డి!
Advertisement

Spirit -Chiranjeevi: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)త్వరలోనే స్పిరిట్ సినిమా (Spirit Movie)షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తికాకుండానే ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక ఆడియో గ్లింప్ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ప్రభాస్ తండ్రిగా చిరంజీవి?

ఇక ఈ వీడియో ఆధారంగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని, అలాగే ఒక ఖైదీగా కూడా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సందీప్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని(Chiranjeevi) కూడా రంగంలోకి దించబోతున్నారని వార్తలు వచ్చాయి. చిరంజీవి ఈ సినిమాలో ప్రభాస్ కు తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు రావడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు అయితే తాజాగా శివ రీ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి రాంగోపాల్ వర్మ నాగార్జునతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

స్పిరిట్ లో చిరంజీవి రూమర్ మాత్రమే..

Advertisement

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు భాగం కాబోతున్నారు అనేది కేవలం రూమర్ మాత్రమేనని, ఈ సినిమాలో చిరంజీవి గారు నటించడం లేదంటే క్లారిటీ ఇచ్చారు. ఇలా చిరు ప్రభాస్ సినిమాలో నటించలేదని వార్త తెలియడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి మాత్రం అభిమానులకు మరొక కిక్ఇచ్చే న్యూస్ తెలిపారు. చిరంజీవి గారితో నేను సోలో సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన అసలు విషయం చెప్పడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవితో సోలో సినిమా..

Advertisement

ఇలా మెగాస్టార్ చిరంజీవినీ ఇంకో హీరో సినిమాలో భాగం చేయకుండా చిరంజీవి గారితోనే పూర్తి సినిమా చేయాలని ఉందని, తప్పకుండా చేస్తాను అంటూ సందీప్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా తృప్తి దిమ్రి(Tripti Dimri) నటించబోతున్న సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించగా ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా 2027వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×