E-Paper
Advertisement

Durandhar-2 vs Ustaad:ఉస్తాద్‌కు ‘ధురందర్’ దెబ్బ.. పవర్ స్టార్ టైమింగ్ మిస్సయ్యారా?

Durandhar-2 vs Ustaad:ఉస్తాద్‌కు ‘ధురందర్’ దెబ్బ.. పవర్ స్టార్ టైమింగ్ మిస్సయ్యారా?
Advertisement

Durandhar-2 vs Ustaad: పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఒక సునామీ రావాలి. కానీ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం ఆ సునామీలో చిక్కుకున్న ఒక చిన్న పడవలా కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఊదరగొట్టిన మేకర్స్, ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు చూసి ముఖం చాటేస్తున్నారు. ధురందర్ 2 వంటి ఒక మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ వస్తుందని తెలిసి కూడా, అదే రోజున ఉస్తాద్‌ను బరిలోకి దింపడం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ‘బ్లండర్’ అని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

 ఓపెనింగ్స్ లో పవర్.. రెండో రోజే తుస్!

Advertisement

మొదటి రోజు ఎలాగోలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండతో రూ.34.75 కోట్లు రాబట్టిన ఉస్తాద్, రెండో రోజు వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోయాడు. కేవలం రూ.9.25 కోట్లకు పడిపోవడం అంటే ఇది సాదాసీదా డ్రాప్ కాదు.. ‘డిజాస్టర్’ సంకేతం. మరోవైపు ధురందర్ 2 కేవలం రెండు రోజుల్లోనే రూ.226 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియాను షేక్ చేస్తుంటే, ఉస్తాద్ కనీసం రూ.50 కోట్ల మార్కును దాటడానికి కూడా తంటాలు పడుతున్నాడు.ఇక మల్టీప్లెక్స్ లలో ధురందర్2  డామినేషన్ చూస్తుంటే, ఉస్తాద్ కేవలం సింగిల్ స్క్రీన్లకే పరిమితమైనట్టు కనిపిస్తోంది.

ధురందర్ సునామీలో కొట్టుకుపోయిన ఉస్తాద్ భగత్ సింగ్!

Advertisement

నిజానికి యష్ ‘టాక్సిక్’ తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ అయ్యిందని సంబరపడ్డారు. కానీ ధురందర్ 2 రూపంలో అంతకంటే పెద్ద గండం ఎదురైంది. అసలు క్లాష్ గురించి తెలిసినా యష్ తన సినిమాను జూన్ కి పోస్ట్ పోన్ చేసుకుని తెలివైన పని చేశాడు. కానీ ఉస్తాద్ టీమ్ మాత్రం అతివిశ్వాసంతో వచ్చి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో కూడా ఉస్తాద్ షోలు క్యాన్సిల్ అయ్యి ధురందర్ కి మారుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 ఫ్యాన్స్ కి మాత్రమేనా? కామన్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారా?

కేవలం పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ చూపిస్తే సరిపోదని, కంటెంట్ లో దమ్ము ఉండాలని ప్రేక్షకులు ఈ సినిమాతో తేల్చి చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా రొటీన్ గా ఉండటం, ప్రమోషన్ల కోసం టైమ్ లేకపోవడం ఉస్తాద్‌కి పెద్ద మైనస్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘OG’ లాంటి సినిమాతో మొదటి రోజే రూ.90 కోట్లు వసూలు చేసిన రికార్డు ఉంది, కానీ ఇప్పుడు ఈ చిన్న వసూళ్లతో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ‘రాంగ్ డెసిషన్’ గా మిగిలిపోనుంది. ఏదేమైనా సోమవారం నాటికి ఉస్తాద్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చాపచుట్టేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఒకరకంగా  ధురందర్ 2 ప్రభంజనం ముందు ఉస్తాద్ నిలబడలేక చేతులెత్తేయడం పవర్ స్టార్ అభిమానులకు మింగుడుపడని నిజం.మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.“కంటెంట్ ఎంత బలంగా ఉన్నా… రిలీజ్ టైమింగ్ తప్పితే పెద్ద సినిమాకైనా బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పవు.”అని !

ALSO READ: Tollywood Star Birthday Updates: బర్త్ డే అప్‌డేట్స్ తో బాక్సాఫీస్ షేక్.. బన్నీ, చరణ్, తారక్ రెడీనా?

Related News

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

Big Stories

Advertisement
×