Durandhar Collections : ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగిస్తుంది రణవీర్ సింగ్ దురంధర్ మూవీ.. మొదటిరోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోట్లు కొల్లగొట్టేస్తుంది.. వరుసగా ఈ మూవీ బాలీవుడ్ హిట్ సినిమాలు రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది.. పదిరోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం మాములు విషయం కాదు. ఒకవైపు విమర్శలు అందుకుంటున్న సరే మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను అందుకుంటుంది. సినిమాకు వస్తున్న ఆదరణ తో ఈ కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో 1000 కోట్లు వసూల్ చేసిన ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ పదిరోజులకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను అందుకుందో ఒకసారి తెలుసుకుందాం..
ఈ మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఆఫీస్ వద్ద మొదట్లో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నాయి. వీకెండ్ వచ్చే లోగా చల్లబడుతున్నాయి. బాలీవుడ్ మూవీ ‘దురంధర్’ ఈ దారిలోనే నడుస్తోంది. ఈ చిత్రానికి వసూళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతవారం కాస్త తగ్గిన కలెక్షన్లు ఈవారం పుంజుకున్నాయి. సెకండ్ ఫ్రైడే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ‘దురంధర్’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఇక శనివారం, ఆదివారం కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 340 కోట్లు వసూళ్లను అందుకుందని తెలుస్తుంది. ఈ కలెక్షన్ల పై మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రాబోతుంది.. ఏది ఏమైన విమర్శలు దురంధర్ మూవీకి ప్లస్ అయ్యాయి.. మొదటి నెల పూర్తయ్యలోగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కూడా ఉంటాయి అని బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read :ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
రణవీర్ సింగ్ దురంధర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన కూడా తెలుగులో మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు.. తెలుగులో రిలీజ్ అవ్వడం కష్టమని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేర్ చేస్తున్న ఏ మూవీ తెలుగులో ఎలాంటి రికార్డులను నమోదు చేసుకుంటుందో చూడాలి.. ఈ భారీ బడ్జెట్ సినిమా లో ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో రూపొందించారు.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలక పాత్రలు పోషించారు.