E-Paper
Advertisement

Teeth Whitening: ఎనామిల్‌ను దెబ్బతీయకుండా.. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ?

Teeth Whitening: ఎనామిల్‌ను దెబ్బతీయకుండా.. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ?
Advertisement

Teeth Whitening: ఆకర్షణీయమైన చిరునవ్వుకు పళ్లు తెల్లగా, శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. దంతాలను తెల్లగా మార్చుకోవడానికి రసాయనాలతో కూడిన టూత్ పేస్టులను ఉపయోగించడం కంటే.. ఎనామిల్‌కు హాని కలగకుండా సహజ సిద్ధమైన పద్ధతులను పాటించడం ఉత్తమం. ఎనామిల్ అనేది దంతాల ఉపరితలంపై ఉండే రక్షక పొర, ఇది దెబ్బతింటే దంతాలు సున్నితంగా మారడం, లేదా రంగు మారడం జరుగుతుంది.

Advertisement

1. బేకింగ్ సోడా :

బేకింగ్ సోడా పళ్లను తెల్లగా మార్చడానికి చాలా కాలంగా ఉపయోగించబడుతున్న సహజ పద్ధతి.

Advertisement

ఎలా పనిచేస్తుంది: బేకింగ్ సోడా తేలికపాటి రాపిడి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దంతాల ఉపరితలంపై ఉన్న మొండి మరకలను సున్నితంగా తొలగించి.. పళ్లపై పసుపు రంగును తగ్గిస్తుంది.

ఉపయోగించే విధానం: ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో లేదా నిమ్మరసంతో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను బ్రష్‌పై తీసుకొని వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సున్నితంగా బ్రష్ చేయండి. ఎక్కువగా లేదా గట్టిగా రుద్దడం మానుకోవాలి. ఎందుకంటే అధిక వినియోగం ఎనామిల్‌ను దెబ్బతీయవచ్చు.

2. ఆయిల్ పుల్లింగ్:

ఆయిల్ పుల్లింగ్ అనేది పురాతన పద్ధతి. నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, పళ్లను శుభ్రపరచడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది: కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనె వంటి నూనె నోటిలోని బ్యాక్టీరియాను, చిగుళ్ళపై పేరుకుపోయిన మురికిని తొలగించడానికి సహాయ పడుతుంది. బ్యాక్టీరియా, పళ్లపై మురికి తగ్గడం వల్ల దంతాలు సహజంగా మరింత తెల్లగా కనిపిస్తాయి.

ఉపయోగించే విధానం: ఉదయం నిద్ర లేవగానే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో పోసుకుని, 15 నుంచి 20 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి. తర్వాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోండి.

3. పండ్లు, కూరగాయలు:

కొన్ని పండ్లు, కూరగాయలు పళ్లు తెల్లగా మార్చడంలో సహాయ పడతాయి.

పీచు పదార్థం ఉన్న ఆహారం: స్ట్రాబెర్రీలు, ఆపిల్స్, క్యారెట్‌లు, సెలెరీ వంటి పీచు అధికంగా ఉన్న ఆహారాన్ని నమలడం వల్ల సహజంగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది నోటిని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా రంగు మారిన పళ్లపై మరకలను తొలగిస్తుంది.

మాలిక్ ఆమ్లం: స్ట్రాబెర్రీలలో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాల ఉపరితలంపై ఉన్న మరకలను తొలగించడంలో సహాయ పడుతుంది. పండ్లలో ఉండే ఆమ్లాలు ఎనామిల్‌కు హాని కలిగించవచ్చు. కాబట్టి వాటిని తిన్న వెంటనే (కనీసం 30 నిమిషాల తర్వాత) నీటితో పుక్కిలించడం లేదా పళ్ళు తోముకోవడం మంచిది.

4. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది అనేక వాణిజ్య దంతాల తెల్లబరిచే ఉత్పత్తులలో ఉపయోగించే సహజ బ్లీచింగ్ ఏజెంట్.

ఉపయోగించే విధానం: 1.5% లేదా 3% గాఢత కలిగిన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించి నోటిని పుక్కిలించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మింగకూడదు. దీనిని తరచుగా ఉపయోగించడం లేదా అధిక గాఢతలో వాడటం ఎనామిల్‌కు హాని కలిగించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా, పరిమితంగా మాత్రమే వాడాలి.

Also Read: రాగి రొట్టె ఇలా తింటే.. ఎంత బరువున్నా ఈజీగా తగ్గిపోతారు

5. పరిశుభ్రత:

పళ్లు తెల్లగా ఉండాలంటే అత్యంత ముఖ్యమైన సహజ మార్గం రోజు వారీ పరిశుభ్రతను పాటించడం.

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి: ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, పళ్లపై మరకలు పేరుకు పోకుండా కాపాడుతుంది.

ఫ్లోసింగ్: రోజుకు ఒకసారి ఫ్లాస్ చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలు తొలగిపోతాయి.

రంగు కలిగిన ఆహారాలను తగ్గించడం: కాఫీ, టీ, రెడ్ వైన్, సోడా వంటి డ్రింక్స్, కొన్ని రకా ఆహారాలను తగ్గించడం లేదా వాటిని తాగిన వెంటనే నీటితో పుక్కిలించడం అలవాటు చేసుకోండి.

ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తూ.. డెంటిస్టులను సంప్రదించడం ద్వారా తెల్లటి , ఆరోగ్యకరమైన పళ్లను పొందవచ్చు.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×