E-Paper
Advertisement

Eesha Rebba: తరుణ్ భాస్కర్ తో పెళ్లి.. డేటింగ్ నిజమే అంటున్న ఈషా!

Eesha Rebba: తరుణ్ భాస్కర్ తో పెళ్లి.. డేటింగ్ నిజమే అంటున్న ఈషా!
Advertisement

Eesha Rebba:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు సెలబ్రిటీలు జంటగా కనిపించారు అంటే.. వారి మధ్య లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే కాలక్రమేనా ఆ రూమర్స్ నిజమవుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) తో యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) రిలేషన్ లో ఉంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి తాజాగా ఇప్పుడు ‘ఓం శాంతి శాంతిః’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఈ నెలలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈషా రెబ్బా తరుణ్ భాస్కర్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై స్పందించడమే కాకుండా డేటింగ్ నిజమే అంటూ కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఓం శాంతి శాంతిః తో వస్తున్న తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ..

తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ జంటగా నటిస్తున్న కొత్త విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఓం శాంతి శాంతిః. జనవరి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా భార్యాభర్త మధ్య వచ్చే గొడవలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇద్దరి మధ్య ఉండే అహం, మాటల యుద్ధం ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఇద్దరూ తమ పాత్రలో చాలా సహజంగా నటించారు. నిజానికే వీరిద్దరూ తెలంగాణకు చెందినవారైనప్పటికీ గోదావరి యాసలో సహజంగా మాట్లాడడం విశేషం. ఈ చిత్రం ద్వారా ఏ.ఆర్ సజీవ (AR.Sajeeva)దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్క్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణని , సాధిక్ షేక్, అనూప్ చంద్రశేఖర్ , నవీన్ సనివరపు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

ALSO READ:Pawan Kalyan: రాజకీయాల్లో బిజీ.. ఫ్యాన్స్ కోసం పవన్ కీలక నిర్ణయం!

డేటింగ్ నిజమే – ఈషా రెబ్బ

విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే ఒక మీడియాతో ముచ్చటించిన ఈషా రెబ్బ కు పెళ్లి వార్తలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. “తాజాగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నిజానికి ఈ వార్తలను చూసి మా నాన్న కూడా పెళ్లెప్పుడు?అని అడిగారు. అయితే ఈ ప్రచారం నిజం కాదు.. కానీ నేను ఒకరితో డేటింగ్ చేస్తున్న మాట వాస్తవమే. అయితే అది పూర్తిగా ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది. పెళ్లి ఆలోచనలు చేయలేదు”. అంటూ చెప్పుకొచ్చింది . అయితే ఈమె డేటింగ్ చేస్తున్నది తరుణ్ భాస్కర్ తోనా లేదా ఇంకెవరితోనైనా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు “ఐ యాం సీయింగ్ సం వన్” అంటూ ఇన్ డైరెక్ట్ గా తాను డేటింగ్ చేస్తున్న విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈషా రెబ్బ.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×