E-Paper
Advertisement

Pawan Kalyan: రాజకీయాల్లో బిజీ.. ఫ్యాన్స్ కోసం పవన్ కీలక నిర్ణయం!

Pawan Kalyan: రాజకీయాల్లో బిజీ.. ఫ్యాన్స్ కోసం పవన్ కీలక నిర్ణయం!
Advertisement

Pawan Kalyan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి పేరు అందుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలు చేస్తూనే..మరొకవైపు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లపాటు రాజకీయాలలో పోరాడిన ఈయన.. ఎట్టకేలకు 2024 సార్వత్రిక ఎన్నికలలో తన జనసేనపార్టీ ద్వారా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా.. కూటమి విజయంలో భాగమై ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తారా? అని అనుమానాలు వ్యక్తం అవ్వగా.. తనకు ఉన్నత స్థానాన్ని కల్పించిన అభిమానులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు

రాజకీయాలతో పాటు ఇటువైపు కూడా అడుగులు..

ఈ సినిమా తర్వాత ఆయన చేసిన చిత్రం ఓజీ. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను.. ఆయన అభిమానులు ఎప్పటినుంచో చూడాలని కోరుకున్న స్టైలిష్, పవర్ ఫుల్ అవతారంలో చూపించి సుజీత్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు సీక్వెల్ లో మాత్రమే నటించి ఇక ఆయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారని కామెంట్లు రాగా.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా అభిమానుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..

Advertisement

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సురేందర్ రెడ్డికి.. ఆయన అవకాశం ఇవ్వడమే. ఎంతోకాలంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చూస్తున్న సురేందర్ రెడ్డితో ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా.. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులలో అంచనాలు పెంచుతోంది .మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ ను హైదరాబాదులో నిర్మించిన భారీ సెట్ లో ప్లాన్ చేస్తున్నారట. అటు కథ, పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన వివరాలను ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. ఇకపోతే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Anil Ravipudi: మళ్లీ ఆ స్టార్ హీరోతోనే అనిల్ కొత్త మూవీ.. సూపర్ హిట్ కాంబో రిపీట్!

పవన్ కళ్యాణ్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారా?

Advertisement

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయరు రాజకీయాలకే అంకితం అవుతారు అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు అని.. తనకు అధికారాన్ని కట్టబెట్టిన అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కచ్చితంగా సినిమాలలో కొనసాగుతానని ఈ సినిమాతో చెప్పకనే చెప్పేసారు పవన్ కళ్యాణ్ ..మొత్తానికైతే ఇకపై వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు అటు తన అధికారం ఉపయోగించి ప్రజలకు మంచి చేకూరుస్తారని ఆయన అభిమానులు ఇటు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×