E-Paper
Advertisement

AP & TG : ఏపీ, తెలంగాణ.. కొనసాగుతున్న విచారణల పర్వం!

AP & TG : ఏపీ, తెలంగాణ.. కొనసాగుతున్న విచారణల పర్వం!
Advertisement

రెండు తెలుగు రాష్ట్రాల్లో విచారణల పర్వం కొనసాగుతోంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై అక్కడి కూటమి సర్కార్ కన్నెర్ర చేయగా.. తెలంగాణలోనూ గత బీఆర్ఎస్ పాల్పడిన దోపిడీ, చట్టవ్యతిరేక చర్యలపై సీఎం రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అవినీతి, అక్రమాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై విచారణ కమిటీలు వేసి మరి అక్రమార్కులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏపీ విషయానికొస్తే లిక్కర్ స్కామ్ విషయంలో ఓవైపు సీబీఐ, ఈడీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.కోట్లు చేతులు మారిన వ్యవహారంలో సీబీఐ విచారణ చేస్తుండగా.. మనీ లాండరింగ్ విషయంలో ఈడీ స్పీడు పెంచింది.

తెలంగాణలో సిట్ జోరు..

ఇక తెలంగాణ విషయానికొస్తే ఏపీ కంటే ఎక్కువగా ఇక్కడ విచారణలు కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ సొమ్మును గత సర్కార్ పెద్దఎత్తున దుర్వినియోగం చేసిందని సర్కార్ ఆరోపిస్తున్నది. ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్షన్నర కోట్లు, ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో విదేశీ కంపెనీకి రూ.50 కోట్లు హెచ్ఏండీఏ నిధుల నుంచి చెల్లింపులు.. ఇక ఫ్యోన్ ట్యాపింగ్ పేరిట పెద్దమొత్తంలో డబ్బుల వసూలు చేశారని.. బ్లాక్ మెయిలింగ్‌కు సైతం పాల్పడినట్టు గత ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాళేశ్వరం కమిషన్ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

Advertisement

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో సిట్ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలోనే గొర్రెల స్కామ్ వ్యవహారంపైనా విచారణ ప్రారంభం అవుతుందని చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, గులాబీ బాస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సిట్ విచారణకు హాజరైన కేటీఆర్, హరీశ్ రావుల అరెస్టు త్వరలోనే ఉంటుందని రాష్ట్రరాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇక కాళేశ్వరం తప్పిదంలో కేసీఆర్‌కు సైతం అరెస్టు భయం తప్పేలా లేదని టాక్ వినిపిస్తున్నది. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును ముగించి ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ కేసు.. ఆ తర్వాత గొర్రెల స్కామ్ మీద విచారణలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Hemamalini: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. హేమమాలిని ఎమోషనల్..

Advertisement

 

భయం బంధీలో ప్రతిపక్షాలు..

ఇక ఏపీ విషయానికొస్తే లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దీనికి తోడు వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని సైతం పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని విచారిస్తారని తెలుస్తున్నది. ఆయనపై వచ్చిన హత్యారోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతున్నది. అయితే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని ప్రతిపక్ష వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఇక తెలంగాణలోనూ ప్రభుత్వం ఇచ్చిన ఆరుగ్యారెంటీల అమలుపై ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే వరుసగా సిట్ వేస్తూ రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో వరుస విచారణల కారణంగా ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×