E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’లో టాక్సిక్ లవ్ స్టోరీ.. ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఊహించని లీక్!

రామ్ చరణ్ ‘పెద్ది’లో టాక్సిక్ లవ్ స్టోరీ.. ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఊహించని లీక్!
Advertisement

Peddi Updates: ‘పెద్ది’…మరో వారం రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుండటంతో ప్రమోషన్ లో వేగం పెంచింది మూవీ టీమ్.అందులో భాగంగా భోపాల్, బెంగళూరు నగరాల్లో భారీ ఈవెంట్స్ జరిపిన మేకర్స్ తాజాగా ఢిల్లీలో ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేశారు. ఇక ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది మూవీ టీమ్.ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ట్యూన్ చేసిన ఇన్‌స్పిరేషనల్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్ ‘మస్సా మస్సా’ సాంగ్‌ను ఇక్కడే రిలీజ్ చేశారు.

రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ‘మస్సా మస్సా’

Advertisement

ఇక ఈ పాట బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే నెట్టింట్లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడం విశేషం. ముఖ్యంగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ చూసి కాలర్ ఎగరేస్తున్నారు మెగా అభిమానులు.అయితే ఈ పాట విడుదలైన తర్వాత నార్త్ వర్సెస్ సౌత్ ఆడియన్స్ మధ్య సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిబేట్ కి  తెరలేచింది.యస్ .. ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌లో వచ్చిన ‘మస్సా మస్సా’ సాంగ్ మరింత పవర్‌ఫుల్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

also read :త్రికాల మూవీ రివ్యూ.. విజువల్ వండర్.. కానీ ఆ ఒక్కటి మిస్సైంది!

ఇక ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ ‘పెద్ది’ కథా నేపథ్యం గురించి మాట్లాడుతూ గతంలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయినప్పుడు ఈ సినిమా లైన్ గురించి ఆయన అడిగారని, ఇదొక రకంగా ‘వికసిత్ భారత్’ లక్ష్యాలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయకమైన కథ అని చెప్పినట్లు చరణ్ వెల్లడించారు.

 ఫుట్‌బాల్ ప్లేయర్ మహ్మద్ కథను చెప్పిన మోదీ

ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మహ్మద్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ కథను ప్రధాని మోదీ తనకు స్వయంగా వివరించారని చరణ్ పేర్కొన్నారు. ఆ ఒక్క ప్లేయర్ సాధించిన విజయం వల్ల ఈరోజు ఆ పల్లెటూరు నుంచి ఏకంగా 85 మందికి పైగా ఫుట్‌బాల్ క్రీడాకారులు దేశం తరఫున ఆడుతున్నారని, ఒకే ఒక్క వ్యక్తి సమాజంలో ఎంతటి విప్లవాత్మక మార్పు తీసుకురాగలడు అనేదానికి ఆ ఘటనే నిదర్శనమని చెప్పారు.

also read :ఆ హీరోయిన్ల కాళ్లపై పడ్డ ఊర్వశి, ఆలియా.. ఆ ఫోటోపై బాలీవుడ్ బ్యూటీ ఫైర్!

ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పెద్ది పాత్ర కూడా సరిగ్గా అలాంటి స్ఫూర్తినే రగిలిస్తుందని స్పష్టం చేశారు. అలాగే సినిమాలో డ్యాన్స్ ఇంత అద్భుతంగా చేయడానికి గల కారణాన్ని విలేకరులు అడగగా, ప్రొడ్యూసర్ మైత్రీ మూవీ మేకర్స్ తనకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారంటూ ఫన్నీగా సమాధానమిచ్చి ప్రెస్ మీట్‌లో నవ్వులు పూయించారు చరణ్.

చరణ్‌కు అస్సలు పోలిక ఉండదు 

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ కి జోడీగా ‘దేవర’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి తెలుగులో ఇది రెండో సినిమా కావడం విశేషం. తెరపై కనిపించే చరణ్‌కు, నిజ జీవితంలో ఉండే చరణ్‌కు అస్సలు పోలిక ఉండదని, బయట ఆయన చాలా కూల్‌గా ఉంటారని ఆకాశానికి ఎత్తేసింది జాన్వీ.ఇక తనకి లెజెండరీ నటుడు బొమన్ ఇరానీతో కలిసి పనిచేయాలనే తన కల ఈ సినిమాతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.

also read :జైలర్ 2’లోకి ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. షారుఖ్ నో చెప్పడంతో లక్కీ ఛాన్స్!

మరోవైపు ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ మాట్లాడుతూ ఈ సినిమాలో కేవలం స్పోర్ట్స్, యాక్షన్ మాత్రమే కాకుండా ఒక టాక్సిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందంటూ ఒక క్రేజీ లీక్ ఇచ్చారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య ఒక అందమైన ప్రేమకథ ఉంటే, తనకు చరణ్‌కు మధ్య ఒక విభిన్నమైన లవ్ స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రంగ స్థలం లాగే సరికొత్త రికార్డులని సెట్ చేస్తుదంటూ ఇప్పటికే భారీ ఆశలు పెట్టేసుకుంది టాలీవుడ్.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×