E-Paper
Advertisement

Emo Emo Idi Glimpse: శైలేష్ కొలను కొత్త ట్రాక్.. బ్లడ్ వదిలి, రొమాన్స్ వైపు.. రోషన్ మాంచి లవ్ స్టోరీ పట్టేశాడు!

Emo Emo Idi Glimpse: శైలేష్ కొలను కొత్త ట్రాక్.. బ్లడ్ వదిలి, రొమాన్స్ వైపు.. రోషన్ మాంచి లవ్ స్టోరీ పట్టేశాడు!
Advertisement

Emo Emo Idi Glimpse: దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) అనగానే, బ్లడ్‌తో నిండిన ఊరమాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది ఆయన నుంచి ఒక లవ్ స్టోరీ వస్తే.. ఊహించుకుంటేనే మంచి కిక్ వస్తుంది కదా! ఆ కిక్కునే ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) నాగవంశీ. అవును, బ్లాక్‌బస్టర్ ‘హిట్’ యూనివర్స్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను.. తన రూటు మార్చి ఓ సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా కోసం నిర్మాత నాగవంశీతో చేతులు కలిపారు. ‘ఛాంపియన్’ హీరో రోషన్ మేకా (Roshan Meka), ప్రీతీ ముకుందన్ (Preity Mukundhan) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ (Emo Emo Idi) అనే టైటిల్‌ను ఖరారు చేసి, ప్రేమికుల దినోత్సవం స్పెషల్‌గా గ్లింప్స్‌ను వదిలారు. ఈ కాంబినేషనే వావ్ అనుకుంటే, వారు సినిమాకు పెట్టిన టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. టైటిల్ వినగానే ఉల్లాసమైన ప్రేమ భావనలు మనసులో మెదులుతున్నాయి. ఇక గ్లింప్స్ (Emo Emo Idi Glimpse) చూస్తే సరికొత్త ప్రేమ కథా చిత్రం రాబోతుందనే విషయం స్పష్టమవుతోంది.

Also Read- Rajinikanth: శివరాత్రి ఎఫెక్ట్.. రజనీకాంత్ పోస్టర్ కు పాలాభిషేకం.. ప్రత్యేక పూజలు..

మొదటి చూపులోనే పడిపోయాడు

Advertisement

ఈ గ్లింప్స్‌ను గమనిస్తే, తల్లీకొడుకు మధ్య కాఫీ సంభాషణతో గ్లింప్స్ మొదలైంది. తండ్రి ఊరు వెళ్లడంతో, ఇంట్లో సింగిల్‌గా ఉన్న తల్లి, మలయాళ చిత్రాలు చూస్తూ.. ఇంటికి పరిమితమవడంతో.. కాస్త రిలాక్స్ అవుతుందని, ఆమెని కొడుకు కాఫీ షాప్‌కు తీసుకొచ్చినట్లుగా ఫస్ట్ డైలాగ్‌లోనే క్లారిటీ ఇచ్చారు. కాఫీ షాపులో తల్లీకొడుకుల మధ్య ప్రస్తుత తరం అమ్మాయిలు ప్రేమ విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు?, వివాహం తర్వాత హనీమూన్‌కు తీసుకెళ్లి ఎలా చంపేస్తున్నారు వంటి అంశాలను చర్చిస్తున్నట్లుగా చూపించారు. మరోవైపు అదే కాఫీ షాప్‌లో హీరోయిన్ ప్రీతీ ముకుందన్ (‘కన్నప్ప’ మూవీ ఫేమ్) తన ప్లే లిస్ట్‌లోని అలనాటి క్లాసికల్ పాటను వింటూ ఉంది. కాఫీ అనంతరం వెళుతూ వెళుతూ హీరోయిన్‌ని చూసిన హీరో.. మొదటి చూపులోనే ప్రేమలో పడటం, ఆమె ఎవరో కనుక్కోవడం వంటివి చూపించారు. వాలెంటైన్స్ డేకు పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా ఈ గ్లింప్స్‌ని కట్ చేశారు.

Also Read- Dhurandhar: ధురంధర్ విలన్ పాత్ర పై నాగ్ క్లారిటీ.. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నానంటూ!

2026 దసరా బరిలో..

Advertisement

అభయ్ పాత్రలో రోషన్ మేకా, అపూర్వ పాత్రలో ప్రీతీ ముకుందన్ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. ‘ఛాంపియన్’ తర్వాత రోషన్ ఈ చిత్రంలో నేటి జెన్ జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో కనిపిస్తుండగా, ప్రీతి ఎప్పటిలానే గ్లామర్ లుక్‌లో మెరిసింది. ఇక డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటి వరకు భారీ యాక్షన్‌తో నిండిన ఉత్కంఠభరిత ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాతో ఆయన పూర్తిగా కొత్త జానర్‌లోకి అడుగు పెడుతున్నారు. ఇదే ఆయన మొదటి రొమాంటిక్ కామెడీ చిత్రం. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2026 ఆరంభంలో ‘అనగనగా ఒక రాజు’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టిన నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

Also Read- Funky Day 1 Collections: విశ్వక్ సేన్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×