Sri Chidambaram Garu OTT : థియేటర్లలోకి వచ్చిన సినిమాలు తరువాత ఓటీటీలోకి అడుగు పెట్టక తప్పదు. కానీ కొన్ని సినిమాలు మరీ తొందరగా డిజిటల్ స్ట్రీమింగ్ తో మూవీ లవర్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇటీవలే బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన ఒక రూరల్ డ్రామా, విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. మరి ఆ మూవీ ఏంటి ? దాని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం.
తెలుగు రూరల్ ఎమోషనల్ డ్రామా ‘శ్రీ చిదంబరం గారు’ (Sri Chidambaram Garu). ఫిబ్రవరి 6 థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఈ చిత్రంతో వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మించారు. సంధ్యా వశిష్ట కథానాయికగా నటించగా, తులసి, కల్పలత, గోపీనాథ్, శివకుమార్ మట్టా, అరుణ్ కుమార్, శంకర్ రావు సహాయక పాత్రల్లో నటించారు. చందు రవి సంగీతం సమకూర్చారు. ప్రముఖ చిత్రనిర్మాత వంశీ నందిపాటి (బేబీ ఫేమ్) ఈ చిత్రం థియేటర్లలో విడుదలయిన సమయంలో సపోర్ట్ చేయడమే కాదు, విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. కొత్త నటీనటులతో సినిమాను నిర్మించడంలో, థియేటర్లలో విడుదల చేయడానికి పంపిణీదారులను ఒప్పించడంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి దర్శకుడు వినయ్ రత్నం ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ETV Winలో ఫిబ్రవరి 19న డిజిటల్ గా స్ట్రీమింగ్ కాబోతోంది మూవీ. అంటే కేవలం థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందన్న మాట. మరి ఓటీటీలో అయినా ఈ సినిమాకు ఆశించిన ఆదరణ దక్కుతుందా ? అన్నది చూడాలి.
Also Read : నెలలోపే ఓటీటీలోకి నవీన్ చంద్ర సస్పెన్స్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ డేట్ ఇదే
రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామంలో నివసించే అబ్బాయి సోలమన్ అలియాస్ చిదంబరం(వంశీ తుమ్మల). అతనితో పాటు తన తల్లి కూడా ఉంటుంది. సోలమన్ ఒక భవన నిర్మాణ కార్మికుడుగా పని చేస్తూ లైఫ్ ను నెట్టుకొస్తాడు. అయితే అతనికి మెల్ల కన్ను ఉంటుంది. అందుకే అతను పడే కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు. పైగా అందరూ జాలి చూపిస్తారు. అదే భావనతో ఉంటాడు సోలమన్. ఆ లోపం వల్ల తనను చూసి ఎవ్వరూ నవ్వుకోకూడదని అనుకుంటాడు. అందుకోసం నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. అదే గ్రామానికి చెందిన లీల (సంధ్యా వశిష్ట) హీరోతో ప్రేమలో పడుతుంది. ఆమె సోలమన్ మంచి మనసును చూసి ఫిదా అవుతుంది. కానీ ఒక చిన్న పొరపాటు కారణంగా లీల తనను రిజెక్ట్ కహసిందని అనుకుంటాడు మన హీరో. మరి సోలమన్ చేసిన ఆ పొరపాటు ఏంటి? తరువాత హీరో తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది ? ప్రేమించిన అమ్మాయి మనసును ఎలా గెలుచుకున్నాడు? అనేదే ఈ సినిమా స్టోరీ.