E-Paper
Advertisement

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?
Advertisement

Epic Story: 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించిన డైరెక్టర్ ఆదిత్య హసన్ దర్శకత్వంలో బేబీ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్.సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కి సిద్దమవుతుంది.ఈ సందర్భంగా ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక క్రేజీ స్టోరీ తెగ చక్కర్లు కొడుతుంది.మరి ఆ స్టోరీ ఏంటో మనమూ చూసేద్దాం.

వనపర్తికి చెందిన ఆదిత్య అనే యువకుడి చుట్టూ

Advertisement

కథలోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన ఆదిత్య అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన ఆదిత్య సినిమాలని మాత్రం విపరీతంగా చూస్తాడు.ఇక ఆ క్రమంలోనే డిగ్రీ కొచ్చిన ఆదిత్య ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.అయితే అవేవీ అంతగా సక్సెస్ అవ్వవు.మరో వైపు తల్లి తండ్రుల ప్రెజర్ తో ఇక తప్పని పరిస్థితులలో యూకేకి చదువుకోవడానికి వెళ్తాడు.

 కడలి అనే అమ్మాయి పరిచయం

Advertisement

అయితే అక్కడికి వెళ్ళిన ఆదిత్య తన అమాయకత్వంతో ఇబ్బందులు ఎదుర్కుంటు ఉంటాడు.సరిగ్గా అదే సమయంలో ఆదిత్యకి కడలి అనే అమ్మాయి పరిచయం అవడంతో అతని జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి.ఆ మార్పులు క్రమంగా వారిద్దరి మధ్య ప్రేమకి దారి తీస్తుంది.అయితే ప్రేమలో పడ్డ ఆదిత్య,కడలి ఇద్దరూ ఒకానొక సందర్భంలో కలిసిపోతారు.అయితే క్రమక్రమంగా ప్రేమలో ఇద్దరు పడ్డప్పటికీ వారి ఇద్దరి ఆలోచనలు వేర్వేరు అని కాలం గడుస్తున్న కొద్ది అర్థమవుతుంటుంది.అదే సమయంలో వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువైపోతాయి.

ఎమోషన్స్ కథలో ప్రధానంగా

ఈ క్రమంలో చదువు ఒకవైపు, ప్రేమ మరోవైపు..ఇంకోవైపు కుటుంబ బాధ్యతల ఉండటంతో ఆదిత్యకు జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు కడలి కూడా తన భవిష్యత్తు విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ప్రేమ, ఎమోషన్స్ కథలో ప్రధానంగా కనిపిస్తాయని తెలుస్తోంది.

ఇక సినిమాలో లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్ ని కూడా చాల ప్రధానంగా చూపించబోతున్నాడట డైరెక్టర్ ఆదిత్య హసన్.ప్రేమలో ఉన్న అమ్మాయి,అబ్బాయి కలిసి జీవించడం మొదలుపెట్టిన తర్వాత వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు కథను మరో మలుపు తిప్పుతాయని తెలుస్తుంది.

‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’తో కనెక్షన్

ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘ఎపిక్’ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించిన ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’తో కనెక్షన్ ఉండటమే.‘90s’లో కనిపించిన ఆదిత్య పాత్రకు కంటిన్యూనే ఈ సినిమా అని ఇప్పటికే డైరెక్టర్ చెప్పేశాడు కూడా. ముఖ్యంగా విదేశీ బ్యాక్‌డ్రాప్, యూత్ లైఫ్, ప్రేమ, కుటుంబం, కెరీర్ వంటి అంశాలను దర్శకుడు ఆదిత్య హాసన్ తనదైన శైలిలో చూపించబోతున్నారని టాక్.

ఎపిక్ సినిమాలో విజయ్ దేవరకొండ

అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో మౌళి చేసిన అన్న పాత్రని ఎపిక్ సినిమాలో విజయ్ దేవరకొండ చేస్తున్నాడని, ఈ విషయం మేకర్స్ సీక్రెట్ గా ఉంచారని వినిపిస్తుంది.అదే నిజమైతే మాత్రం రౌడీ ఫ్యాన్స్ కది ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.చూడాలి మరి సెప్టెంబర్ 11న ఈ సినిమా ఎలాంటి సర్ప్రైజ్ లు ఇస్తుందో !

Tags

Related News

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

Big Stories

Advertisement
×