E-Paper
Advertisement

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?
Advertisement

Yash Toxic Movie: రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం టాక్సిక్(Toxic). గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదల అయి ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి కేవలం మన పాన్ ఇండియా భాషలలో కాకుండా ఇంగ్లీష్ వర్షన్ లో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అభిమానులకు తీవ్రంగా నిరాశ కలిగించిందని చెప్పాలి.

టాక్సిక్ డిజాస్టర్ టాక్..

ఇలా ఈ సినిమాకు భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ రావడం దారుణమైన కలెక్షన్లు రావడం పట్ల ఇప్పటివరకు హీరో యశ్ (Yash)ఇక్కడ స్పందించలేదు అయితే తాజాగా ఈ సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ గురించి స్పందించినట్టు టాక్సిక్ సినిమా డబ్బింగ్ సూపర్వైజర్ జై దేవ్ ఇటీవల యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేశారు. కే జి ఎఫ్ 2 విడుదలైన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత యష్ నటించిన టాక్సిక్ సినిమా కావడంతో అభిమానులు అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి కానీ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో తాను చాలా ఎమోషనల్ అయ్యానని జై దేవ్ మోహన్ ఎమోషనల్ అయ్యారు.

సినిమా ఫలితం ప్రేక్షకుల నిర్ణయిస్తారు..

Advertisement

ఈ సినిమాకు వస్తున్న టాక్ చూసి తాను ఎమోషనల్ అయ్యాననే విషయం తెలిసిన యష్ స్వయంగా తనకు ఫోన్ చేసి మరి ఓదార్చారని తెలిపారు. సినిమా రిలీజ్ అయ్యాక నెగిటివ్ రివ్యూ చూసి బాగా డిస్టర్బ్ అయ్యాను కానీ యష్ ఫోన్ చేసి ఏమాత్రం “బాధపడొద్దు జై దేవ్.. ఫలితాన్ని కోరుకున్నట్లే ప్రేక్షకులు నిర్ణయిస్తారు అది వాళ్ళ ఇష్టం మనం తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి” అంటూ నాకు ధైర్యం చెప్పారు కానీ ఆయన మాటల్లో ఉన్న బాధ స్పష్టంగా అర్థం అయిదని జై దేవ్ తెలిపారు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ విషయంలో చాలా మార్పులు జరిగాయని అది ప్రేక్షకులకు నచ్చకపోతే మనం ఏం చేయలేం అనే విషయాన్ని కూడా ఈయన ఒప్పుకున్నారు.

మూడు లక్షల పైరసీ లింక్స్ …

ఇక టాక్సిక్ సినిమా ఇలాంటి రిజల్ట్ అందుకోవడానికి ప్రధాన కారణం పైరసీ(Piracy) కూడా అని ఈయన తెలిపారు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 3 లక్షలకు పైగా పైరసీ లింక్ డిలీట్ చేయించినట్టు జై దేవ్ తెలిపారు. అదే విధంగా ఈ సినిమా డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఆమెపై భారీగా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారని ఆరోపించారు. అదేవిధంగా యష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టాక్సిక్ సినిమాపై దుష్ప్రచారాలు చేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చారంటూ ఈయన సినిమా రిజల్ట్ గురించి ఈ డిజాస్టర్ టాక్ కారణంగా యశ్ స్పందన గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

Related News

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

Big Stories

Advertisement
×