E-Paper
Advertisement

ETV Prabhakar: క్షమించండి.. నా కొడుకుది తప్పే! అంటూనే.. మళ్లీ ఇదేంటి?

ETV Prabhakar: క్షమించండి.. నా కొడుకుది తప్పే! అంటూనే.. మళ్లీ ఇదేంటి?
Advertisement

ETV Prabhakar: ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ (Chandrahass) పాడిన పాట వివాదంగా మారిన విషయం తెలిసిందే. అదేమని ప్రశ్నిస్తే.. మరుసటి రోజు వార్నింగ్స్ ఇస్తూ మరీ చంద్రహాస్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విషయంలో చంద్రహాస్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, వెంటనే స్పందించి విషయాన్ని పెద్దది కాకుండా చూడాల్సిన చంద్రహాస్ తండ్రి, నటుడు ప్రభాకర్ (ETV Prabhakar) తాజాగా ఓ వీడియోను విడుదల చేసి తన కొడుకు చేసింది తప్పు అంటూ, క్షమాపణలు చెప్పారు. అలాగే, ఆ రోజు ఫంక్షన్‌కు హాజరైన గెస్ట్‌లు జెడి చక్రవర్తి, ఆది సాయికుమార్, జయంత్ సి పరాన్జీలకు కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆయన తన పెంపకం గురించి, ఆ రోజు పాట అయిపోయిన తర్వాత కొడుకుకు చెప్పిన మాటల గురించి చెప్పిన తీరుపై నెటిజన్లు ఇంకాస్త ఫైర్ అవుతున్నారు.

Also Read- Romantic Movie OTT : విజయ్ దేవరకొండ హీరోయిన్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి… అయితే ఒక చిన్న ట్విస్ట్

నెగిటివ్ ప్రచారంతోనే..

Advertisement

ఈటీవీ ప్రభాకర్ అంటే అందరూ ఎంతగానో అభిమానిస్తారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఈ రోజు బుల్లితెర ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతున్నారు. మొదటి నుంచి ఆయన ఎంతో క్రమశిక్షణతోనే ఉన్నారు. మరి అలాంటి ఒక వ్యక్తి నుంచి వారసుడు వచ్చాడంటే ఇంకెంత క్రమశిక్షణగా ఉండాలి. మొదటి సినిమా నుంచి నెగిటివ్ ప్రచారంతోనే స్టార్‌గా మారాలనేలా చంద్రహాస్ ప్రవర్తన ఉంది. అక్కడే మేల్కొని ఉంటే, విషయం ఇంత దూరం వచ్చేది కాదు. సగం పాట అయిపోయాక వచ్చి, నాన్నా.. అలా కాదు, అలా పబ్లిక్‌లో పాడకూడదు అని చెప్పానని ప్రభాకర్ ఈ వీడియోలో అంటున్నారు. అందుకు చంద్రహాస్ కూడా ‘సరే నాన్నా’ అని అన్నాడని అంటున్నారు. మరి మరుసటి రోజు విడుదల చేసిన వీడియోలో బెదిరింపుల సంగతి ఏంటి? ‘సరే నాన్నా’ అని చెప్పిన వ్యక్తిలో మరుసటి రోజు కూడా ఎలాంటి మార్పులేదుగా?

Also Read- Manchu Lakshmi: గ్రీన్ పార్క్ హోటల్‌లో మంచు లక్ష్మికి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?

క్షమాపణ చెప్పడానికే పోస్ట్ చేశారా? లేక?

Advertisement

ఇక బూతు పదాలపై కూడా ఇందులో ఓ విశ్లేషణ ఇచ్చారు. చంద్రహాస్ పాడిన పాటని ముక్కలుగా కట్ చేసి ఇది వినండి అని వినిపించారట. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అనుకుంటున్నప్పుడు, ఎక్కువ మంది ఇది వింటే పాడవుతారని అనుకున్నప్పుడు దానిని మళ్లీ వినిపించాల్సిన అవసరం లేదని ప్రభాకర్ ఇందులో అంటున్నారు. నిజమే, అసలు సినిమాకు సంబంధం లేని పాటను అలా పబ్లిగ్గా, స్టేజ్‌పై పాడాల్సిన అవసరం కూడా లేదు కదా? మరి ఎందుకు పాడారు? మళ్లీ నాలుగు రోజుల తర్వాత వచ్చి వివరణ ఇస్తున్నారు. ఇది పక్కాగా సినిమా ప్రమోషన్ కోసం ప్లాన్ చేశారనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది. నిజంగా క్షమాపణలు చెప్పాలని అనుకుంటే, చెప్పాల్సింది ప్రభాకర్ కాదు… దీనికంతటికీ కారణమైన వారు పబ్లిగ్గా చెప్పేసి, మళ్లీ ఇది రిపీట్ కాదని అని ఉండే ఏ గోల ఉండేది కాదు. అసలు ఈ వీడియోను నిజంగా మీరు క్షమాపణ చెప్పాలని విడుదల చేసి ఉంటే, ఆ ఒక్కటీ చెప్పేసి ఉంటే సరిపోయేది. ఇప్పుడు సరికొత్త కాంట్రవర్సీకి దారిచ్చారంటూ నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు.

Also Read- Fantasy movie: 30 ఏళ్ల వయసుకు వచ్చే 13 ఏళ్ల అమ్మాయి… మేజిక్ పవర్ తో షాకింగ్ ట్విస్ట్… దిమ్మతిరిగే జీవితం

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×