Manchu Lakshmi: తెలుగు చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్, నటి, నిర్మాత మంచు లక్ష్మికి చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా చెప్పుకునే గ్రీన్ పార్క్ హోటల్ (Green Park Hotels) యాజమాన్యం ప్రవర్తనపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని తెలియజేస్తూ, అసలు అక్కడ ఏం జరిగిందో ఓ వీడియో ద్వారా వివరించారు మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కూడా మంచు లక్ష్మి ఇలాంటి విషయాలపై స్పందించి, అందరినీ అలెర్ట్ చేశారు. ఫ్లైట్స్ విషయంలోనూ, ఇండస్ట్రీలో జరిగే విషయాల్లోనూ ఆమె తనదైన తరహాలో స్పందించి వార్తలలో నిలిచారు. ఇప్పుడు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో తను ఫేస్ చేసిన చేదు అనుభవం గురించి చెబుతూ..
Also Read- Comedy Movie OTT : భార్యతో విడాకులు… వద్దు వద్దంటూనే ప్రేమలో… ఔరా అనిపించే స్టోరీ
మంచు లక్ష్మి తన సినిమా ప్రమోషన్స్ నిమిత్తం చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌కు వెళ్లారు. తనతో పాటు తన ఫొటోగ్రాఫర్ కూడా వెళ్లగా అతన్ని, అతని దగ్గర ఉన్న కెమెరాను అక్కడి సిబ్బంది అనుమతించకపోవడంతో మంచు లక్ష్మి హర్టయింది. కనీసం ఒక చిన్న కెమెరాను, ఒక వ్యక్తిని కూడా అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. కెమెరాలను అనుమతించకూడదనే నిబంధన ఏదైనా ఉంటే అది లిఖితపూర్వకంగా చూపించమని కోరినప్పటికీ, సిబ్బంది దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ‘ఏ రూల్ కూడా నాకు రాతపూర్వకంగా చూపించలేదు, పైగా ఎటువంటి పరిష్కారాన్ని కూడా వారు సూచించలేదు. పైగా చాలా రూడ్‌గా సమాధానం ఇచ్చారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, సమస్య తలెత్తినప్పుడు హోటల్ ప్రతినిధులు ఎటువంటి పరిష్కారాన్నిఅందించలేదని, జిఎమ్‌తో మాట్లాడాలి అని చెప్పినా వారు వినలేదని ఆమె చెప్పుకొచ్చారు.
Extremely disappointed with the experience at Green Park Hotels Chennai.
No rule was shown to me in writing, and no solution was offered, not even allowing a small camera with one person. This is not what hospitality should look like. pic.twitter.com/TeZRsFkyTu— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 7, 2026
Also Read- Niharika Konidela: నిహారిక కొత్త పయనం.. పసుపు రంగు దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తోన్న మెగా డాటర్
సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వారికి ప్రత్యేక మర్యాదలు దక్కుతాయి. కానీ, చెన్నై వంటి నగరంలోని ఒక స్టార్ హోటల్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె షాక్ అయ్యారు. ఆతిథ్యం అంటే ఇలా ఉండకూడదు. అతిథుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, వారి సమస్యలను పరిష్కరించడం ప్రాథమిక బాధ్యత. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగిందంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సరే తనని ఫొటోగ్రాఫ్స్ తీసుకోవడానికి అనుమతించలేదు సరే.. ఇదే హోటల్‌లో ఇంతకు ముందు కొందరు ఫొటో షూట్ కూడా చేసుకున్నారు. మరి అదేంటి? అంటే సమాధానం లేదు. ఇంకా ఇక్కడ నాన్‌స్టాప్‌గా కన్‌స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. టక్ టక్ మంటూ ఒకటే శబ్ధం.. అంటూ మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటూ ఆమె అభిమానులు సదరు హోటల్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన వారంతా.. ఆ హోటల్స్‌లో మేము కూడా ఇలానే ఇబ్బంది పడ్డామని రియాక్ట్ అవుతున్నారు. గ్రీన్ పార్క్ హోటల్ యాజమాన్యం ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మికి ఎదురైన ఈ చేదు అనుభవం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read- Mrithyunjay: శ్రీవిష్ణు సినిమా నుంచి హీరోయిన్ లుక్కొచ్చింది.. మేడమ్ చాలా స్ట్రిక్ట్!