E-Paper
Advertisement

Romantic Movie OTT : విజయ్ దేవరకొండ హీరోయిన్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి… అయితే ఒక చిన్న ట్విస్ట్

Romantic Movie OTT : విజయ్ దేవరకొండ హీరోయిన్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి… అయితే ఒక చిన్న ట్విస్ట్
Advertisement

Romantic Movie OTT : కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’ (Tu Meri Main Tera Main Tera Tu Meri). క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇది ప్రస్తుతం రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. ధురంధర్ సునామీ కారణంగా, ఇది థియేటర్లలో అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేక పోయింది. అయితే ఓటీటీలో ఇది ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో కలిసిన ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు ? ఆ తర్వాత వచ్చిన సమస్యలన ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా కథ.

ఎక్కడ చూడచ్చు ?

సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘మేరీ మై తేరా మై తేరా తు మేరీ’ రొమాంటిక్ కామెడీ చిత్రం, మేరీ క్రిస్మస్ సందర్భంగా 25 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్, నమహ్ పిక్చర్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అదర్ పూనవల్లా, అపూర్వ మెహతా, భూమిక తివారీ, షరీన్ మంత్రి కేడియా దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే పాత్రల్లో నటించగా, నీనా గుప్తా, జాకీ ష్రాఫ్, టికు తల్సానియా సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹48 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది. ఇక ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన మాత్రమే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. సినిమా చూడటానికి, ప్రేక్షకులు రూ. 349 చెల్లించాలి. అయితే మరో రెండు వారాల్లో ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉండచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రే (కార్తీక్ ఆర్యన్) ఒక జాలీ టైప్ ఎన్ఆర్ఐ వెడ్డింగ్ ప్లానర్, రూమీ (అనన్య పాండే) ఏమో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రచయిత్రి. వీళ్ళిద్దరూ క్రొయేషియాలో ఒక లగ్జరీ క్రూయిజ్ జర్నీలో అనుకోకుండా కలుస్తారు. మొదట్లో ఒకరినొకరు అస్సలు ఇష్టపడరు. చిన్న చిన్న గొడవలతో మొదలైన వీళ్ళ పరిచయం మెల్లగా ప్రేమగా మారుతుంది. ఆ విదేశీ ప్రయాణంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ చాలా సరదాగా సాగుతాయి. కానీ అసలు చిక్కు కథ ఆగ్రాకు మారాక మొదలవుతుంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం, కుటుంబ బాధ్యతల కోసం రేతో తన బంధాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రూమీకి. ఇటు రే తన ఫ్రీడమ్ లైఫ్‌ని వదిలి రూమీ కోసం తనను తాను మార్చుకోవడానికి సిద్ధపడతాడు. చివరికి ఈ ఇద్దరు ప్రేమికులు తమ కుటుంబాలను ఎలా ఒప్పించారు ? రూమీకి ఉన్న బాధ్యతలు ఏమిటి ? వీళ్ళు తమ ప్రేమను ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ‘స్పేస్ జెన్ చంద్రయాన్’… స్పేస్ అడ్వెంచర్ లవర్స్ కు ఐ ఫీస్ట్ ఈ సిరీస్

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×