Bollywood Relationships :బ్రేకప్ – ప్యాచప్ , మూడు ముళ్ళు – తెగ దెంపులు , కమిట్ మెంట్ లు – కాంట్రవర్సీలు .. ఇలా మాకేదీ కొత్త కాదని మళ్ళీ ప్రూవ్ చేస్తుంది బాలీవుడ్. ఇదే క్రమంలో తాజాగా ఒక జోడీ తమ బంధానికి బాయ్ బాయ్ చెప్పేస్తానంటే మరో జోడీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతుంది. ఇంతకీ ఆ మూడు ముళ్ళు – తెగ దెంపుల ముచ్చట్లు ఏంటో ఒకసారి చూసేద్దాం.
ఎవలీన్ శర్మ – తుషాన్ బిందీ
ముందుగా తెగ దెంపుల జోడీ కొస్తే.. ఎవలీన్ శర్మ తన హస్బెండ్ తుషాన్ బిందీతో విడిపోవాలని డిసైడ్ అయిందట. ఇంతకీ ఈ ఎవలీన్ శర్మ ఎవరనుకుంటున్నారా.. అదేనండి.. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో ‘ఐషా’ అనే పాత్రతో మనందరికీ దగ్గరైంది ఈ అమ్మడే.
డెంటల్ సర్జన్ తుషాన్ బిందీని పెళ్లి చేసుకొని గత ఐదేళ్లుగా ఆస్ట్రేలియాలో కాపురం పెట్టిన ఎవలీన్ ఇపుడు తుషాన్ తో తెగదెంపులు చేసుకునేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈ బ్రేకప్ వెనకాల ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదని, ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి మెచ్యూర్డ్ గా తీసుకున్న నిర్ణయం అని చెప్పడం ఇక్కడ గమనార్హం.
ఇక జంటకి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ ఉండగా వారికోసం, వారి ఫ్యూచర్ కోసం ‘కో-పేరెంటింగ్’ పద్ధతిలో మరింత రెస్పాన్సిబుల్ గా ఉంటామని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే యే జవానీ హై దీవానీ (2013), టంకీ సాలా! (2013), తేరా హీరో (2014), యారియాన్ (2014), జబ్ హ్యారీ మెట్ సెజల్ (2017) వంటి సినిమాలలో కీలకపాత్రలు పోషించిన సంగతి తెల్సిందే.
ఏది ఏమైనా భర్తతో తెగదెంపులు చేసుకున్నా పిల్లల విషయంలో రెస్పాన్సిబుల్ గా ఉంటామని చెప్పడం మెచ్చుకోతగ్గ విషయం.
also read:టాలీవుడ్‌లో పర్సంటేజీ వార్…థియేటర్ల వద్ద ‘జెట్లీ’ బ్రేకులు.. అసలు ఏం జరుగుతోంది?
ఆకాంక్ష రంజన్ కపూర్ – శరణ్ శర్మ
ఇక ఎవలీన్ సంగతి ఇలా ఉంటె మా ప్రేమని పెళ్లి వరకు తీసికెళ్తామంటూ మురిసిపోతుంది ఆకాంక్ష రంజన్ కపూర్. యస్.. ఆలియా భట్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆకాంక్ష ‘గిల్టీ’ సినిమాతో మనకి దగ్గరైన సంగతి తెల్సిందే.
‘గుంజన్ సక్సేనా’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ వంటి సినిమాలతో క్రేజ్ కొట్టేసిన ప్రముఖ దర్శకుడు శరణ్ శర్మతో గత రెండేళ్లుగా సైలెంట్ గా ప్రేమాయణం సాగిస్తున్న ఈ బాంబే బ్యూటీ ఇపుడు పెళ్లి కూతురు గెటప్ లోకి మారిపోతుంది. నిజానికి వీరిద్దరి మధ్య సం థింగ్ సం థింగ్ అని బీ టౌన్ ఎప్పటి నుండో కోడై కూస్తుంది కూడా. మొత్తానికి ఆ రూమర్స్ ని నిజం చేస్తూ ఈ జోడీ ఈ ఏడు జూలైలో ఒక్కటి కానుంది. ఇక ఇందుకోసం ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఇండోర్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయట కూడా.
మొత్తానికి జీవితాంతం కలిసి నడుస్తామనుకున్న ఒక జంట మధ్యలోనే వేరయిపోతుంటే, అదే జీవితాంతం కలిసి నడుస్తామంటూ మరో జంట ముందుకు వెళ్తుందన్నమాట!
also read:రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే.