E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే.

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే.
Advertisement

Peddi Release : వచ్చేసింది ..అప్ డేట్ వచ్చేసింది. ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న పెద్ది రిలీజ్ అప్ డేట్ వచేసింది. బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాని జూన్ 4న రిలీజ్ చేయబోతున్నామంటూ తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన భారీ ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేసేసింది.దీంతో ఇది కదా మాక్కావలసింది అంటూ మురిసిపోతున్నారు మూవీ లవర్స్.

జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ జాతర

Advertisement

వాస్తవంగా పెద్ది సినిమాలని జూన్ 25న రిలీజ్ చేస్తామంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు మేకర్స్. కానీ, తాజాగా అప్పటిదాకా ఆగలేం అంటూ అంతకు ముందే థియేటర్లలోకి పెద్దిని తీసుకురావాలని డిసైడ్ చేసింది మూవీ టీమ్. ఇక ఇదే విషయమై గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా మాట్లాడుతూ జూన్ 4న వరల్డ్ వైడ్ గా ‘పెద్ది’ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు. దీంతో ఎప్పటి నుండో సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఇపుడు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న పెద్ది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులని స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మే నెల మొత్తం ప్రమోషన్స్ తో హోరెత్తించబోతున్నారన్న మాట.

Advertisement

also read :గాయపడ్డ సింహం రివ్యూ…గాయపడ్డ సింహం గర్జించిందా లేదా?

శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌తో కిక్కిచ్చే ప్లాన్

ఇక ప్రమోషన్ల విషయంలో బుచ్చిబాబు సరికొత్త స్ట్రాటజీని ప్లాన్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. మాములుగా ఏ సినిమాకైనా రిలీజ్ కి ముందే అన్ని పాటలని వదలడం మనకి తెల్సిందే. కానీ ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ వదిలిన మేకర్స్ ఇక రిలీజ్ కి ముందు కేవలం ఒక్క పాటని మాత్రమే వదులుతారని సమాచారం. అంటే సినిమాలో ఉన్న మిగతా పాటలని థియేటర్ లోనే చూడాలన్న మాట.

ఇక ఇది వరకే వచ్చేసిన చికిరి, రై రై రారా కి ఎంతటి అప్లాజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో శృతి హసన్ స్పెషల్ చేస్తున్న సంగతి తెల్సిందే. బహుశా వదిలే సాంగ్ ఇదే అయి ఉండాలి. ఇక ఇదే పాటకి ఈ కోలీవుడ్ భామకి ఏకంగా మూడు కోట్లు ముట్టచెప్పారన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. చూడాలి మరి భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి ఏమాత్రం కిక్కిస్తుందో!

బాక్సాఫీస్ రికార్డులు కనుమరుగేనా

ఒకవైపు రామ్ చరణ్ మాస్ ఇమేజ్, మరో వైపు బుచ్చిబాబు ఎమోషనల్ అండ్ రా స్టోరీ టెల్లింగ్… ఈ రెండు కలిస్తే మాస్ ఆడియన్స్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పైగా దేవర తర్వాత జాన్వీ నటిస్తున్న సినిమా కావడం, ఆస్కార్ విన్నర్ అందిస్తున్న మ్యూజిక్, జగపతి, శివరాజ్ కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ కీరోల్స్ లో కనిపించనుండటం సినిమాని మరో మెట్టు ఎక్కించేవే.

ఇక ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ లుక్ ఎంత వైరల్ అయిందో తెల్సిందే. చూడాలి మరి ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో!

also read :అత్తాకోడళ్ల మధ్య ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×