E-Paper
Advertisement

Jana Nayagan Release Date: జన నాయగన్‌కు మళ్లీ బ్రేక్.. విజయ్ చివరి సినిమాకి తీరని అడ్డంకులు

Jana Nayagan Release Date: జన నాయగన్‌కు మళ్లీ బ్రేక్.. విజయ్ చివరి సినిమాకి తీరని అడ్డంకులు
Advertisement

Jana Nayagan Release Date: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రానున్న నేపథ్యంలో..ఆయన నటిస్తున్న చివరి సినిమా జన నాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా సినీ వర్గాలు కూడా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా పడిన కష్టాలు మరే సినిమా పడలేదేమో.

మొదటగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వాయిదా పడింది. జనవరి 9న అంటే నేడు సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో సినిమా రిలీజ్ కి బ్రేక్ పడింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

Advertisement

ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సెన్సార్ సమస్య అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో జన నాయగన్ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని అందరూ భావించారు. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ విషయంపై కోర్టులో మధ్యాహ్నం.. నుంచి విచారణ కొనసాగింది.

తాజాగా డివిజన్ బెంచ్..సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో మళ్లీ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. U/A సర్టిఫికేట్ అంశం తేలే వరకు సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. ఈ పరిణామం చిత్రబృందంతో పాటు అభిమానులను కూడా నిరాశలో ముంచింది.

Advertisement

విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వచ్చే చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’పై భావోద్వేగం ఎక్కువగా ఉంది. ఈ సినిమా ద్వారా అభిమానులకు ఒక బలమైన సందేశం ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారని ఆయనకు దగ్గర వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అన్ని చట్టపరమైన అంశాలు క్లియర్ అయ్యే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో జన నాయగన్ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు విజయ్ అభిమానులు ఆతృతతో ఎదురుచూడక తప్పడం లేదు.

ALSO READ: Thalapathy Vijay: జన నాయకుడి వల్ల డివివి దానయ్యకు అదృష్టం..ఎందుకో తెలుసా..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×