Jana Nayakudu Censor Issue: తమిళ స్టార్ హీరో విజయ్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి విజయ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త ఇప్పటికే అభిమానులకు తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు). కాబట్టి ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మొదట ఈ సినిమాను తెలుగు ప్రముఖ నిర్మాత DVV దానయ్య నిర్మించాల్సి ఉంది. విజయ్‌తో సినిమా అంటే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. దానికి తోడు విజయ్ అడిగిన రెమ్యునరేషన్ విన్న తర్వాత దానయ్య ఒక్కసారిగా షాక్ అయ్యారట. విజయ్ ఏకంగా భారీ మొత్తమే అడగడంతో, ఈ ప్రాజెక్ట్ నుంచి దానయ్య తప్పుకున్నట్లు టాక్ వినిపించింది.
అక్కడితో ఈ సినిమా మాత్రం ఆగిపోలేదు. వెంటనే KVN ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. దానయ్య ఈ సినిమా కోసం అప్పటివరకు చేసిన ఖర్చును మొత్తం క్లియర్ చేసి, సినిమాను తమ చేతుల్లోకి తీసుకున్నారు. అంతేకాదు, విజయ్‌కు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ రెమ్యునరేషన్ రూ.220 కోట్లు ఆఫర్ చేశారు. ఇది విజయ్ కెరీర్‌లోనే భారీ పారితోషికం. అంతా బాగానే ఉంది అనుకుంటూ సినిమాని జనవరి 9న భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ కూడా జోరుగా జరిగాయి. విజయ్ అభిమానుల్లో ఫుల్ హైప్ వచ్చింది.
అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులే ఉంది కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో పెద్ద సమస్య మొదలైంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో థియేటర్లు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సులు ఇప్పటికే బుకింగ్స్ తీసుకోవడంతో, ఇప్పుడు కొన్ని చోట్ల టికెట్ డబ్బులు రిఫండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల నిర్మాతలపై ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరిగింది. ఇంత పెద్ద మొత్తం పెట్టి సినిమా తీసిన KVN ప్రొడక్షన్స్ ఇప్పుడు భారీ స్ట్రెస్‌లో ఉన్నట్లు టాక్. ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా స్పష్టత లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో, సెన్సార్ సమస్యలు ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియక మేకర్స్ టెన్షన్‌లో ఉన్నారు.
విజయ్ అభిమానులు కూడా ఈ డిలే వల్ల నిరాశలో ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమా ఇలా ఆగిపోతుందా అనే భయం మొదలైంది. ఇక మరోవైపు చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో DVV దానయ్యకు మాత్రం ఇది ఒక లక్కీ ఎస్కేప్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆయన ఈ సినిమా నిర్మించి ఉంటే, ఇప్పుడు ఎదురవుతున్న ఈ సమస్యలన్నీ ఆయన మీదే పడేవి. భారీ రెమ్యునరేషన్, సెన్సార్ ఇబ్బందులు, రిలీజ్ డిలే అన్నీ కలిసి పెద్ద తలనొప్పి అయ్యేవి.
జన నాయగన్ సినిమా విషయానికి వస్తే ఇది 2023లో వచ్చిన తెలుగు సినిమా భగవంత్ కేసరికి రీమేక్. దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
ALSO READ:The Raja Saab: రాజాసాబ్ టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఫైర్.. మెమోలు ఎందుకు..?