E-Paper
Advertisement

The Raja Saab: ఒక పాట కూడా రిలీజ్ చేయలేదు, కానీ ఆ డేట్ కి కంప్లీట్ ఆల్బమ్ ఇస్తారట

The Raja Saab: ఒక పాట కూడా రిలీజ్ చేయలేదు, కానీ ఆ డేట్ కి కంప్లీట్ ఆల్బమ్ ఇస్తారట
Advertisement

The Raja Saab Audio Album Update: బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది అనేది వాస్తవమే. కానీ ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కంప్లీట్ గా మిస్ అయిపోయారు అభిమానులు. ప్రభాస్ లో ఒక రకమైన చిలిపితనం, ఎనర్జీ ఉంటుంది.

కంప్లీట్ సాంగ్స్ అప్పుడు రెడీ

Advertisement

ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలోని కొన్ని సీన్స్ యూట్యూబ్ లో చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది. కమెడియన్స్ తో పాటు ఆ రెంజ్ కామెడీ చేస్తాడు ప్రభాస్. అయితే మారుతి ప్రభాస్ హీరోగా సినిమా చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చేవి. నేను ప్రభాస్ తో సినిమా చేస్తే బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాను ప్లాన్ చేస్తాను అని అంటూ ఉండేవారు. అతనికి వాళ్ళ ప్రాజెక్టు ఓకే అయిపోయింది. ప్రస్తుతం రా.జా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అధికారికంగా కూడా ప్రకటించారు.

డిసెంబర్ 25న రిలీజ్

రాజా సాబ్ సినిమాకి సంబంధించి డిసెంబర్ 25న అన్ని సాంగ్స్ జ్యూక్ బాక్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యూక్ బాక్స్ అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని పాటలను కూడా ఒకే వీడియో రూపంలో విడుదల చేస్తారు. ఇప్పటివరకు రాజా సాబ్ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదల కాలేదు. ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు సందర్భంగా రాజా సాబ్ సినిమా నుంచి పాట వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. గతంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ మాటను చెప్పారు. మళ్లీ నవంబర్ 5న పాట విడుదలవుతుంది అన్నారు. మొత్తానికి పాటను విడుదల చేయలేదు. త్వరలోనే ఈ పాటను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

Advertisement

Also Read: Tamil Actress: కమిట్మెంట్ అడిగాడు.. ధనుష్ మేనేజర్ పై నటి సంచలన కామెంట్స్

సెకండ్ ట్రైలర్ రిలీజ్

మామూలుగా ఒక సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది అనుకున్నప్పుడు దాదాపు వారం రోజులు ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ ఈ సినిమాకి సంబంధించి దాదాపు మూడు నెలల ముందే రాజా సాబ్ ట్రైలర్ విడుదల చేసేసారు. ట్రైలర్ విడుదల చేయడంతో చాలామంది మారుతీను ప్రశంసించారు. మరోవైపు మారుతి తన పని పూర్తి చేసేసాడు. కేవలం తమన్ వల్లే సాంగ్స్ లేట్ అవుతున్నాయి అని విమర్శలు కూడా వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారు. జనవరి 9న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. జనవరి 2వ తారీఖున ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.

Related News

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!

విడాకుల పై కాజల్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×