E-Paper
Advertisement

Tamil Actress: కమిట్మెంట్ అడిగాడు.. ధనుష్ మేనేజర్ పై నటి సంచలన కామెంట్స్

Tamil Actress: కమిట్మెంట్ అడిగాడు.. ధనుష్ మేనేజర్ పై నటి సంచలన కామెంట్స్
Advertisement

Manya Anand Comments on Dhanush Manaer: కాస్టింగ్ కౌచ్.. గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో ఈ పదం బాగా వినిపిస్తుంది. ఏ భాష ఇండస్ట్రీలో అయినా మహిళ నటులకు కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతున్నారు. తమకు ఎదురైన అనుభవాలను ఇప్పటికే ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు. కానీ, కాస్టింగ్ కౌచ్ మాత్రం చెక్ పడటం లేదు. ఇటీవల హేమ కమిటీ సైతం సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని వెల్లడించింది. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఎంతోమంది మహిళలు వేధింపులకు గురైనట్టు తమ రిపోర్టులో వెల్లడించింది.

కాస్టింగ్ కౌచ్ బాధితులేందరో..

Advertisement

అయినప్పటికీ ఏదోక ఇండస్ట్రీలో మహిళ నటులు వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటులు మాత్రమే కాదు వారి మేనేజర్లు నుంచి కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ బుల్లితెర నటి ఓ అగ్ర హీరో మేనేజర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభాన్ని గుర్తు చేసుకుంది. తమిళ్ బుల్లితెర నటి మాన్య ఆనంద్ హీరో ధనుష్ మేనేజర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పలు సీరియల్స్ తో బుల్లితెరపై మంచి గుర్తింపు పొందిన ఆమె ఇటీవల కోలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా తను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని, సినిమా ఆఫర్ కోసం కమిట్మెంట్ అడిగారిన చెప్పింది.

ధనుష్ మేనేజర్ కమిట్మెంట్ అడిగారు..

అది ఎవరో కాదని, అగ్ర హీరో ధనుష్ మేనేజర్ అని వెల్లడించింది. హీరో ధనుష్ మేనేజర్ శ్రేయాస్ కొత్త సినిమా కోసం తనని సంప్రదించారని చెప్పింది. ‘ఈ సినిమాలో నాకు హీరోయిన్ చాన్స్ ఇస్తా అన్నాడు. అయితే ఆఫర్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు‘ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే తాను వెంటనే ఆ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసి వెనక్కి వచ్చేశానిన తెలిపింది. తాను వద్దని చెప్పినా నాకు ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్ బార్ ఫిల్మ్స్ లోకేషన్ తో పాటు మూవీ స్క్రిప్ట్ ఫోన్ కి పంపించాడు. అంతేకాదు పదే పదే నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు. తాను ఎన్నిసార్లు వద్దన్నా శ్రేయాస్ నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు’ అని మన్య ఆనంద్ చెప్పుకొచ్చింది.

Advertisement

Also Read: Akhanda 2 : అఖండ సెకండ్ సింగిల్ వచ్చేసింది, బాలయ్య విజువల్స్ కు తమన్ విధ్వంసం

మరో వ్యక్తి కూడా ఇదే అభ్యర్థన చేశాడు..

అంతేకాకుండా మరో మేనేజర్ కూడా ఇదే సినిమా కోసం ఫోన్ చేసి అతడు కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది. కాగా ప్రస్తుతం ఆమె కామెంట్స్ కోలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ధనుష్ మేనేజర్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. వెంటనే అతడిని మేనేజర్ పదవి నుంచి తొలగించాలని ధనుష్ కి రిక్వెస్ట్ వస్తున్నాయి. కాగా తమిళ టీవీ సీరియల్ వనతై పోలా లో మాన్య ఆనంద్ లీడ్ రోల్లో నటించింది. మరి ఆమె ఆరోపణలపై ధనుష్ టీం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×