E-Paper
Advertisement

Allari Naresh: అందుకే కామెడీ సినిమాలకు దూరం, అల్లరి నరేష్ భయపడుతున్నాడా?

Allari Naresh: అందుకే కామెడీ సినిమాలకు దూరం, అల్లరి నరేష్ భయపడుతున్నాడా?

Allari Naresh:సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్నారు అల్లరి నరేష్. రవిబాబు దర్శకుడుగా పరిచయమైన ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. కామెడీ అంటే ఇలా కూడా ఉంటుంది అని ఆ సినిమా ప్రూవ్ చేసింది. ఆ తర్వాత కాలంలో ఎక్కువగా కామెడీకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే అల్లరి నరేష్ చేసేవాడు. ఒక తరుణంలో అల్లరి నరేష్ సినిమా అంటే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోయేవాళ్ళు.

ఫ్యాన్స్ నిరాశ

అల్లరి నరేష్ సినిమాకి వెళ్తే హ్యాపీగా కాసేపు నవ్వుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఎంటర్టైన్మెంట్ టీవీల్లో ఎక్కువగా వస్తుండటం వలన థియేటర్కు వెళ్లే ఆడియన్స్ కూడా తగ్గిపోయారు. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే ప్రతిరోజు కనీసం ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ షో లు ఈజీగా కనిపిస్తాయి. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా చాలా కామెడీ స్కిట్స్ వచ్చేస్తున్నాయి. ఇంస్టాగ్రామ్ లో వీల్స్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటి మధ్యలో ఒక కామెడీ సినిమా వర్కౌట్ కావాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. వరుసగా కామెడీలు సినిమాలు చేసే నరేష్ నాంది సినిమా తర్వాత తన శైలి పూర్తిగా మార్చేశారు. అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు.

అందుకే కామెడీకి దూరం..

వాటిలో అల్లరి నరేష్ తో చేసినవి ఎక్కువ కామెడీ శాతం సినిమాలే. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కామెడీ సినిమాలు ఎందుకు చేయట్లేదు అనేదానికి క్లారిటీ ఇచ్చాడు నరేష్. ఒకప్పుడు మేము సీమశాస్త్రి అనే సినిమా చేశాము. ఇప్పుడు ఆ సినిమాను చేయలేము. చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అలానే కితకితలు అనే సినిమా చేశాము. ఆ సినిమా ఇప్పుడు చేస్తే బాడీ సేమింగ్ అంటూ మాట్లాడుతారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఈ రోజుల్లో కామెడీ సినిమా చేయడం అనేది చాలా కష్టమైన పని. అప్పట్లో మేము సుడిగాడు సినిమా స్పూఫ్ లాగా చేశాము. కానీ ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయితే instagram లో సాయంత్రానికి దానికి సంబంధించిన స్పూఫ్ వీడియో కనిపిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు నరేష్. నరేష్ మాటలను బట్టి చూస్తుంటే తనకంటూ ఒక క్లారిటీ ఉంది అని ఈజీగా అర్థమయిపోతుంది.

పర్ఫెక్ట్ విజన్

అయితే ఈసారి నరేష్ నుంచి ఒక కామెడీ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండే విధంగానే చేస్తాడు అని అర్థమవుతుంది. అయితే వ్యక్తిగతంగా నరేష్ ఎంత మంచోడో అందరికీ తెలుసు. ఎవరినీ నొప్పించే ఉద్దేశం తనకి ఉండదు. కానీ ఈ రోజుల్లో మనుషులకి అసహనం ఎక్కువగా పెరిగిపోయింది. ఒక చిన్న వాక్యాన్ని, పదాన్ని మాటను బట్టి కూడా మనోభావాలు ఈజీగా దెబ్బతింటున్నాయి. ఆలోచించడం మానేసి ఆవేశంతో ముందుకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ల వరకు వెళ్ళిపోతున్నారు. అందుకే ఈరోజుల్లో ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం నరేష్ సీరియస్ జోనర్ లో సినిమాలు చేస్తున్నారు. ఒకవేళ నరేష్ కామెడీ సినిమా చేస్తే ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి ఇప్పుడు మొదలైంది.

Related News

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×