Faria Abdullah:ప్రముఖ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. యాంకర్ గా చేస్తే ఆ షో కే మరింత గుర్తింపు వస్తుంది అని అభిమానులు కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక నటిగా తనకంటూ ఒక గుర్తింపును అందుకున్న ఈమె.. గొప్ప డాన్సర్ కూడా.. ప్రస్తుతం పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా అబ్దుల్లా.. బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది.
ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. మరొకవైపు సత్య ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం జెట్లీ. ఇందులో కీలక పాత్ర పోషించడమే కాకుండా హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది. ఈ రెండు చిత్రాలు కూడా మే మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
సాధారణంగా ఫరియా అబ్దుల్లా అనే పేరు వినగానే కచ్చితంగా ఈమె ముస్లిం అని అర్థమవుతుంది. కానీ తల్లిదండ్రుల మతం గురించి తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది కూడా.. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “మా నాన్న పుట్టుకతో ముస్లిం కాదు. ఆయన హిందూ కుటుంబంలోనే పుట్టారు.కానీ 30 సంవత్సరాల వయసులో ఇస్లాం మతం ఆయన దృష్టిని ఆకర్షించింది. అందులోని పద్ధతులు, దైవచింతన, ప్రశాంతత, ఇతర అంశాలు ఆయనను ఆకర్షించాయి. దాంతో ఆయన హిందూ మతాన్ని కాదని ముస్లిం మతాన్ని స్వీకరించారు.
ఇక మా నాన్న మాత్రమే కాదు మా అమ్మ కూడా అంతే.. మా అమ్మ పుట్టుకతో ముస్లిం.. కానీ ఆమెకు హిందూ మత ఆచారాలు, పద్ధతులు, దైవచింతన వంటివి ఎంతో నచ్చి ఆమె ఇటు వైపు వచ్చింది. అలా మా నాన్న పుట్టుకతో హిందువు అయితే ముస్లింలోకి.. మా అమ్మ పుట్టుకతో ముస్లిం అయితే హిందూ మతంలోకి మారారు. అయితే మా ఇంట్లో మాత్రం అన్ని మతాలను గౌరవిస్తాము. ప్రేమిస్తాము. మతాల మధ్య తేడా ఉండదు. ప్రతి మతంలో ఉన్న మంచిని మాత్రమే తీసుకుంటాము. ముఖ్యంగా నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నది అదొక్కటే. మానవత్వంతో బ్రతకడమే మంచిది.ఒకరితో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే క్రమంలో కంఫర్ట్ కోసం భాగస్వామి మతం మారడం చూస్తుంటాం.. కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా పరస్పరం మతాలు మార్చుకొని ఆ తర్వాతే పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
also read:ప్రేమలో పడ్డ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్!
ఫరియా అబ్దుల్లా సినిమాల విషయానికొస్తే ఈ రెండు చిత్రాలతో పాటు భగవంతుడు సినిమాతో పాటు సత్యదేవ్ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది.