E-Paper
Advertisement

ఏంది సామీ ఈ ఆఫర్? రూ.35 వేల ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేస్తోంది!

ఏంది సామీ ఈ ఆఫర్? రూ.35 వేల ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేస్తోంది!
Advertisement

Flipkart Offers: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. Realme GT 7Tపై ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.34,999 ఉండగా.. ఇప్పుడు రూ.27,999కి తగ్గించేశారు. అంటే.. దీని ద్వారా దాదాపు రూ.7,000 వరకు ఆదా చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్‌ఫోన్ విడి భాగాల రేట్లు పెరిగిపోతున్న ఈ తరుణంలో ఇలాంటి ఆఫర్ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి.

లాగ్ అనే మాటే ఉండదు..

Realme GT 7Tలో వాడిన ప్రాసెసర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గేమ్స్ ఆడేవారికైతే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ చిప్‌సెట్ ఉండటం వల్ల ఫోన్ అస్సలు లాగ్ అవ్వదు. హెవీ గేమ్స్ ఆడినా.. రకరకాల యాప్స్ వాడుతున్నా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. దీని స్పీడ్ చూస్తే ఈ రేటుకి ఇంత పవర్‌ఫుల్ ఫోన్ వస్తుందా అని మీరే ఆశ్చర్యపోతారు.

Advertisement

Also Read: మరీ ఇంత తక్కువకా? అది కూడా 2K డిస్‌ప్లే ట్యాబ్లెట్, Redmi Pad 2 9.7 ఫీచర్లు ఇవే!

అమోలెడ్ స్క్రీన్ మ్యాజిక్..

ఈ ఫోన్ స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనిలో 6.78 అంగుళాల పెద్ద అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. దీని బ్రైట్‌నెస్ ఎంతంటే.. ఎండలో నిలబడి ఫోన్ చూసినా అక్షరాలు క్లియర్‌గా కనిపిస్తాయి. యూట్యూబ్ వీడియోలు చూసినా లేదంటే ఇన్ స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసినా కలర్స్ చాలా చక్కగా, కళ్లకు ఇంపుగా ఉంటాయి. స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉండటం వల్ల వాడేటప్పుడు మెరుగైన పనితీరును అందిస్తుంది.

నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..

Advertisement

చాలామందికి ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని భయం ఉంటుంది. కానీ ఈ ఫోన్ విషయంలో ఆ టెన్షన్ అవసరం లేదు. Realme GT 7Tలో ఏకంగా 7,000mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా.. 120W ఫాస్ట్ చార్జర్ ఉంది కాబట్టి.. కొన్ని నిమిషాల్లోనే ఫోన్ మళ్లీ ఫుల్ అయిపోతుంది. బ్యాటరీ ఎక్కువ రావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఆఫర్ వివరాలు ఇలా..

ఈ ఫోన్ విడుదలై ఏడాది అవుతున్నా.. దీని ఫీచర్లు మాత్రం నేటి తరం ఫోన్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్, నీటిలో పడినా పాడవకుండా IP69 రేటింగ్ వంటి ఫీచర్లు దీనికి పెద్ద ప్లస్. కెమెరా కంటే కూడా ఫోన్ స్పీడ్‌గా ఉండాలి, బ్యాటరీ చాలా సేపు రావాలి అనుకునే వారికి ఈ రూ.28 వేల డీల్ బాగా సెట్ అవుతుంది. స్లిమ్ ఫోన్ కావాలనుకునే వారు తప్ప, మిగతా అందరూ కళ్లు మూసుకుని ఈ ఫోన్‌ను తీసేసుకోవచ్చు.

Also Read: Vivo T5x 5Gపై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ కొనలేరు బ్రో!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

యూత్ మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లతో.. బోట్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే ?

కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!

రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

కేబుల్ కదిలిస్తేనే ఛార్జింగ్ ఎక్కుతుందా? మీ ఫోన్‌లో అసలు సమస్య ఇదే కావచ్చు!

ఈ MSI గేమింగ్ ల్యాప్‌టాప్‌లో అన్నీ అదుర్స్.. ఒక్క ధర విషయంలోనే పెద్ద ట్విస్ట్!

అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

Big Stories

Advertisement
×