E-Paper
Advertisement

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!
Advertisement

Fauzi Movie: యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘ఫౌజీ’ మూవీ టీమ్. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో ప్రభాస్ లుక్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం పక్కా అంటున్నారు రెబల్ ఫ్యాన్స్.

చేతిలో గన్ పట్టుకుని, సీరియస్ లుక్‌తో కనిపిస్తున్న డార్లింగ్‌ను చూస్తుంటే ఈ సినిమాలో హను రాఘవపూడి ఎదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక పోస్టర్‌పై ‘యాన్ ఎరా బిగిన్స్’ అని పెట్టడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పాలి.

Advertisement

దర్శకుడు హను రాఘవపూడి విషయానికి వస్తే ‘సీతారామం’ సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన ఈ సెన్సిబుల్ ఫిలిం మేకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తు ఉండటంతో డార్లింగ్ ని ఎలా చూపించబోతున్నాడా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇకఇప్పటివరకు వచ్చిన పోస్టర్‌ మరియు వదిలిన అప్ డేట్స్ చూస్తుంటే ఇదేదో పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామా అని అర్థం అవుతుంది.అయితే అసలు కథ ఏంటి? ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది? సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి? అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ పోస్టర్‌ విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పాలి. ఇప్పటివరకు భారీ యాక్షన్ సినిమాలతో అలరించిన డార్లింగ్.. ఈసారి మరో కొత్త అవతారంలో కనిపించబోతుండటంతో మురిసిపోతున్నారు ఫ్యాన్స్.

Advertisement

పోస్టర్ లో పాతకాలపు వాతావరణం, వెనుక కనిపిస్తున్న సెటప్, పోస్టర్‌లో నంబర్లు.. ఇవన్నీ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.ఇక పోస్టర్ చూస్తుంటేనే సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడుతుందో అర్థమవుతోంది.

ఇక ‘ఫౌజీ’ అనే టైటిల్ బట్టి చూస్తే సైనికుల నేపథ్యంలో కథ సాగుతుందా? దేశం కోసం పోరాడే వ్యక్తి కథనా? అనే చర్చ మొదలైంది. దీనికి తోడు పోస్టర్‌పై ‘ఎ బ్యాటాలియన్ హూ ఫైట్స్ అలోన్’ అనే లైన్ ఉండటంతో ఆసక్తి మరింత పెరిగింది. ఒంటరిగా పోరాడే ఒక వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుందా? అందులో ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా నుంచి వచ్చే మాత్రం ట్రైలర్ రావాల్సిందే.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక పోస్టర్‌లో ఈ సినిమాను 2027 మార్చి 19న విడుదల చేయబోతున్నామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటిదాకా రిలీజ్ విషయంలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయనే చెప్పాలి.

మొత్తానికి ‘ఫౌజీ’ కొత్త పోస్టర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌లో మళ్లీ హడావుడి మొదలైందని చెప్పాలి .రాబోయే రోజుల్లో టీజర్ లేదా గ్లింప్స్ వస్తే కాని ప్రభాస్‌ను హను రాఘవపూడి ఏ రేంజ్‌లో చూపించబోతున్నారో తెలిసేలా లేదు !

ALSO READ :ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

Tags

Related News

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

కళే నా ప్రాణం.. కానీ నన్నే మోసం చేశారు.. గరివిడి లక్ష్మి కన్నీటి కథ!

హే యూ అంటూ హీట్ పెంచేసిన అనుపమ.. లుక్ మామూలుగా లేదుగా!

వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!

Big Stories

Advertisement
×