E-Paper
Advertisement

కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు

కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు
Advertisement

Farming Career Over Corporate Job| చేతిలో డిగ్రీ.. కళ్లలో మంచి ఉద్యోగం సాధించాలనే కల.. కానీ పెరుగుతున్న పోటీతో కొలువు దొరకడం కష్టంగా మారింది. దీంతో చైనాలో యువ గ్రాడ్యుయేట్లు తమ కెరీర్‌పై కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరాల్లో ఉద్యోగాల కోసం వెతకడం మానేసి, సొంత ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. వ్యవసాయాన్ని ఆధునిక టెక్నాలజీతో ముడిపెట్టి ఆదాయం సంపాదిస్తున్నారు. అసలు ఈ మార్పు వెనుక కారణాలేంటి?

ఉద్యోగ పోటీతో వ్యవసాయం వైపు యువత అడుగులు

చైనాలో కాలేజీ చదువులు పూర్తి చేసిన యువతకు మంచి ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారింది. నిరుద్యోగం, కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న పోటీ వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నాయి. దీంతో చాలామంది యువత పెద్ద నగరాలను విడిచి గ్రామాలకు వెళ్తున్నారు. వ్యవసాయం చేయడంతో పాటు చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో వీరిని ‘జిన్‌నోంగ్రెన్’ (Xinnongren) అని పిలుస్తున్నారు. దీని అర్థం ‘కొత్త తరం రైతులు’. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇటీవలి సంవత్సరాల్లో సుమారు 1.5 కోట్ల మంది గ్రాడుయేట్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం లేదా చిన్న వ్యాపారాలను ఎంచుకున్నారు. యువతను గ్రామాల వైపు ప్రోత్సహించేందుకు చైనాలోని స్థానిక ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. పన్ను రాయితీలు, రుణాలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నాయి.

వ్యవసాయ క్షేత్రానికి తిరిగొచ్చిన వాంగ్ హోంగ్బో

చైనాలోని ఇన్నర్ మంగోలియాకు చెందిన వాంగ్ హోంగ్బో ఈ మార్పునకు ఒక మంచి ఉదాహరణ. ఆయన కుటుంబం తరతరాలుగా సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) పంటను సాగు చేస్తోంది. కుటుంబంలో యూనివర్సిటీకి వెళ్లిన మొదటి వ్యక్తి వాంగ్. అయితే, ఆయన వ్యవసాయం చేయాలని కుటుంబం మొదట కోరుకోలేదు. చదువుకున్నవారు పొలాల్లో పనిచేయడం కంటే ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయాలని అక్కడ చాలామంది భావిస్తారు.
వాంగ్ ఫిల్మ్‌మేకింగ్ చదివి బీజింగ్‌లోని ఓ నిర్మాణ సంస్థలో ఇంటర్న్‌షిప్ సంపాదించారు. కానీ ఎక్కువ పని, తక్కువ జీతం ఆయనను నిరాశపరిచాయి. నెలకు సుమారు 500 డాలర్లు సంపాదించినా, అద్దె, ఆహారం వంటి ఖర్చులకే ఎక్కువ డబ్బు సరిపోయేది. చదువు పూర్తయ్యాక ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు ఆయన సొంతూరికి తిరిగొచ్చి తండ్రితో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించారు.

సోషల్ మీడియాతో ఆదాయం సంపాదిస్తున్న యువ రైతు

Advertisement

వ్యవసాయ పనులను సోషల్ మీడియాలో చూపించడం ద్వారా వాంగ్ కొత్త అవకాశాలను గుర్తించారు. ఒక వీడియోలో ఆఫీసు దుస్తులు ధరించి పొలంలో పని చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన తండ్రి సరదాగా మందలించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి.
తర్వాత వాంగ్ పొలాల్లో రోజువారీ పనులను వీడియోలుగా రూపొందించి, లైవ్‌స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. స్థానిక రైతుల పంటలను ఆన్‌లైన్‌లో విక్రయించడంలోనూ సహాయం చేస్తున్నారు. కొందరు రైతులు అమ్మకాలపై 20 శాతం కమీషన్ చెల్లిస్తున్నారు. ఒక్కో లైవ్‌స్ట్రీమ్ ద్వారా ఆయన 400 డాలర్ల వరకు సంపాదించగలుగుతున్నారు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?

ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయంలో కొత్త మార్పులు

వాంగ్ వ్యవసాయాన్ని మరింత ఆధునికంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పురుగుమందులు చల్లడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. పంటలకు నీరు, ఎరువులు అందించడానికి సరైన సమయాన్ని గుర్తించే ఏఐ యంత్రాన్ని కూడా వినియోగిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ ద్వారా పంటల గురించి ప్రచారం చేస్తూ వినియోగదారులకు నేరుగా చేరువవుతున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి సవాళ్లు విసురుతున్నాయి. ఇటీవల బలమైన గాలులు, వర్షాల వల్ల ఆయన కుటుంబానికి చెందిన పొద్దుతిరుగుడు పంట దెబ్బతింది.

Also Read: రూ.కోటి జీతం జాబ్ వదులుకొని బిజినెస్ చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2.2 కోట్ల ఆదాయం

యువతకు వాంగ్ ఇస్తున్న సందేశం ఇదే

అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని వాంగ్ యువతకు సూచిస్తున్నారు. అదే సమయంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. ఆయన ప్రయాణం వ్యవసాయం కేవలం సంప్రదాయ వృత్తి మాత్రమే కాదని నిరూపిస్తోంది. టెక్నాలజీ, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే గ్రామాల్లోనూ కొత్త కెరీర్ అవకాశాలను సృష్టించుకోవచ్చని ఆయన అనుభవం తెలియజేస్తోంది.

Related News

అమెరికాలో లక్ష డాలర్ల జీతం..  ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?

రిటైర్మెంట్ ఫండ్ రూ.8 కోట్లు ఉంటే ఇక నో టెన్షన్.. కానీ నెలకు ఎంత SIP చేస్తే ఇది సాధ్యం?

భర్త సంపాదన నెలకు రూ.11 వేలు.. విడాకుల తరువాత భార్యకు నెలవారీ రూ.25000 చెల్లించాలన్న కోర్టు

ఏడాదికి రూ. కోటి వరకు జీతం కావాలా? వెంటనే ఈ కెరీర్ ఎంచుకోండి

రూ.కోటి జీతం జాబ్ వదులుకొని బిజినెస్ చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2.2 కోట్ల ఆదాయం

అమ్మో.. అప్పులు, గోల్డ్ లోన్‌తో తీర్చేద్దాం.. బ్యాంకులకు కొత్త తలనొప్పి?

రేపటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి..ఎమర్జెన్సీ సేవింగ్స్ వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×