E-Paper
Advertisement

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!
Advertisement

Venkatesh Speech:వెంకీ మామ సినిమాల్లో కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాల్లోనే కాదు.. బయట కూడా తనదైన స్టైల్ లో ఆడియన్స్ ని నవ్విస్తుంటాడు వెంకీ. ఇదిగో ఇలాగే తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వెంకీ మామ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

వెంకటేష్ మాట్లాడుతూ తన స్పీచ్ మధ్యలో స్టూడెంట్స్ సైలెంట్‌గా ఉండకూడదని,తాను ఏదైనా మాట్లాడితే కనీసం అరుస్తూ అయినా ఉండాలని, అలా ఉంటేనే తనకు మాట్లాడాలనిపిస్తుందని నవ్వులు పూయించాడు. తనకు మామూలుగానే ఎక్కువగా మాట్లాడటం రాదంటూ తనదైన స్టైల్‌లో కామెడీ చేశాడు వెంకీ ఇక ట్రైలర్‌కు స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

Advertisement

ఆ తర్వాత కాలేజీ లైఫ్ గురించి మాట్లాడుతూ కాలేజీలో గడిపే నాలుగేళ్లు జీవితంలో చాలా ముఖ్యమైనవని, ఆ రోజులను బాగా ఎంజాయ్ చేయాలని చెప్పాడు. ఎందుకంటే ఒక్కసారి కాలేజీ లైఫ్ అయిపోయిందంటే మళ్లీ తిరిగి రాదని అన్నాడు.అయితే కాలేజీకి వెళ్లడం అంటే ఎప్పుడూ క్లాసులో కూర్చుని పాఠాలు వినడమే కాదని,క్లాసులు బంక్ కొట్టినప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని చెప్పాడు. తాను కూడా అలా బయట ఉన్నప్పుడే ఎన్నో ఆలోచనలు వచ్చేవని సరదాగా చెప్పుకొచ్చాడు వెంకీ మామ.

కాఫీ షాప్‌లో కూర్చున్నప్పుడు కావచ్చు.. చెట్టు కింద ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు కావచ్చు.. ఎక్కడైనా మంచి ఆలోచనలు రావచ్చని ,అయితే క్లాసులు బంక్ కొట్టడమే జీవితం కాదని, చదువు కూడా పూర్తి చేయాలని గుర్తుచేశాడు వెంకీ.డిగ్రీ తెచ్చుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి.. వీటన్నింటికంటే ముఖ్యంగా మంచి మనిషిగా ఎదగాలని స్టూడెంట్స్‌కు సలహా ఇవ్వడం ఇక్కడ విశేషం.

Advertisement

ఇక కాలేజీలో ఉండే ఈ నాలుగేళ్లలో మంచి క్యారెక్టర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యమని,జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా మనిషిగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించాడు. స్టూడెంట్స్ అందరూ మంచి వ్యక్తులుగా ఎదగాలని చెప్పుకొచ్చాడు.

ఇక సినిమా ట్రైలర్‌ను ఎగ్జాంపుల్ గా తీసుకున్న వెంకీ సినిమా ట్రైలర్ కొన్ని నిమిషాలే ఉంటుందని, కానీ ప్రతి ఒక్కరూ తమ జీవితానికి సంబంధించిన ట్రైలర్‌ను ముందుగానే ఊహించుకోవాలని చెప్పాడు. భవిష్యత్తులో ఏం కావాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి జీవితాన్ని గడపాలి? అనే విషయాలపై ఇప్పటి నుంచే ఆలోచించాలని సూచించాడు.ఇక స్టేజ్‌పై నుంచి మాట్లాడటంతోనే ఆగిపోకుండా స్టూడెంట్స్ దగ్గరకు వెళ్లి వారితో సరదాగా గడిపాడు వెంకీ. తమ అభిమాన హీరో తమ ముందుకు రావడంతో విద్యార్థులు తెగ సందడి చేశారు.

మరోవైపు విద్యార్థినులతో మాట్లాడుతు కాలేజీకి వెళ్లి బాగా చదువుకోవాలని, ప్రేమలో పడే విషయంలో తొందరపడొద్దని ఓ అమ్మాయికి చెబుతూ నవ్వులు పూయించాడు.ఇక తన భార్య గురించి మాట్లాడుతూ తన భార్య మంచిదేనని, కానీ ఇంట్లో అన్ని పనులూ తనతోనే చేయిస్తుందని చెప్పాడు. వంట కూడా తానే చేస్తానంటూ చెప్పడంతో ఆడిటోరియం గొల్లుమంది.

చివర్లో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతుందని సెలవు రోజు కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమాను చూడాలని కోరాడు.మొత్తానికి ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంచ్‌లో హంగామా చేసిన వెంకీ మామ కాలేజీ లైఫ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో స్టూడెంట్స్‌కు చెప్పడం మెచ్చుకోతగ్గ విషయం. చూడాలి మరి భారీ అంచనాలు పెంచేస్తున్న ఆదర్శ కుటుంబం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

ALSO READ :ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

Tags

Related News

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

కళే నా ప్రాణం.. కానీ నన్నే మోసం చేశారు.. గరివిడి లక్ష్మి కన్నీటి కథ!

హే యూ అంటూ హీట్ పెంచేసిన అనుపమ.. లుక్ మామూలుగా లేదుగా!

వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!

Big Stories

Advertisement
×