E-Paper
Advertisement

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!
Advertisement

Tollywood:గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్సర్స్ అసోసియేషన్ లో డ్యాన్స్ మాస్టర్స్ మధ్య వివాదం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా డ్యాన్సర్స్ కష్టానికి తగిన ఫలితం లభించలేదని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తన వాయిస్ రైజ్ చేయగా.. మరి కొంత మంది ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ ఏకంగా 10 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్ గ్రూప్ , శేఖర్ మాస్టర్ గ్రూప్ అన్నట్టు రెండు వర్గాలుగా విడిపోయారు. పైగా జానీ మాస్టర్ వివరణ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఫిలిం ఫెడరేషన్ తమపై పెత్తనం చెలాయిస్తున్నారని , తమను బెదిరిస్తున్నారు అంటూ ఇటీవల జానీ మాస్టర్ నిర్మాతలను కలిసి వినతి పత్రం అందించారు. అయితే దీంతో సీరియస్ అయిన ఫిలిం ఫెడరేషన్ ఆయనను ఆలిండియా ఓవర్ గా బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఫిలిం ఫెడరేషన్ అత్యవసర భేటీ..

దీంతో రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఎంటర్ అవ్వడం.. అటు జానీ మాస్టర్, డ్యాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలతతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, డైరెక్టర్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

సుమలత, జానీ మాస్టర్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందాము – అనిల్ వల్లభనేని

Advertisement

ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ..” డాన్సర్స్ అసోసియేషన్ లో ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయి. జానీ మాస్టర్ వర్సెస్ యూనియన్ డ్యాన్సర్స్ మధ్య జరిగిన విషయాలపై వారు మాకు వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ఆయనపై ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణను ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటున్నాము. జానీ మాస్టర్ సుమలత ఇచ్చిన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందింది. 26న డ్యాన్సర్ అసోసియేషన్ జనరల్ బాడీలో రాజీనామా చేసిన వాళ్లు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తారు”. అంటూ కామెంట్లు చేశారు.

also read:ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

బాలకృష్ణ చొరవతో సమస్యకు పరిష్కారం – చదలవాడ శ్రీనివాసరావు

Advertisement

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారు కాకినాడ నుండి కాల్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి హీటెక్కించే వాతావరణం ఉండకూడదని, సమస్యను పరిష్కరించమని చెప్పారు. డ్యాన్సర్స్ ఇరువర్గాలు చాలా మంచి వారే. ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఇంతటితో సమస్య పరిష్కారం అయ్యింది” అంటూ తెలిపారు.

ఇంటిలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమే – ప్రసన్నకుమార్

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..” ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమే.అన్నీ ఈరోజు పరిష్కారం అయ్యాయి.డ్యాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తారు. బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు” అంటూ తెలిపారు.

చిరంజీవి చొరవతో సమస్యకు పరిష్కారం – జానీ మాస్టర్

జానీ మాస్టర్ మాట్లాడుతూ..” ఫిలిం ఫెడరేషన్ కి మేము వివరణ ఇచ్చాము. ఇంతటితో సమస్య పరిష్కారమైంది. ఈ విషయంలో చిరంజీవి గారు చూపిన చొరవ అభినందనీయం. వారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారు కూడా సమస్య పరిష్కారానికి సహాయం చేశారు” అంటూ తెలిపారు.

చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు – సుమలత

డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మాట్లాడుతూ.. “చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. డాన్సర్స్ కష్టం వాళ్లకే చెందాలి అని ఒక ప్రెసిడెంట్గా నేను తపన పడ్డాను కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఈరోజుతో పులిస్టాప్ అయ్యాయి. అందరం కలిసి ముందుకు వెళ్దాం” అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు సుమలత . ఇక మొత్తానికైతే అత్యవసర భేటీలో ఇన్ని రోజులు ఏర్పడ్డ సమస్యలకు ఒక్కసారిగా పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×