E-Paper
Advertisement

Tollywood Movie Financiers : వెనక్కి తగ్గుతున్న ఫైనాన్సర్లు, అఖండ 2 సినిమానే గుణపాఠం?

Tollywood Movie Financiers : వెనక్కి తగ్గుతున్న ఫైనాన్సర్లు, అఖండ 2 సినిమానే గుణపాఠం?

Tollywood Movie Financiers : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా రాణించడం అనేది సాధారణమైన విషయం కాదు. కేవలం దర్శకుడు ఆలోచనని నమ్మి డబ్బులు పెట్టడం అనేది బాగా రిస్క్ తో కూడుకున్న పని. ఒక సినిమాను నిర్మించడం వెనక నిర్మాత ఎన్ని కష్టాలు పడతాడు అవి మాటల్లో చెప్పలేనివి. నిర్మాత అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అని అపోహ కూడా చాలామందికి ఉంటుంది. అని చాలామంది నిర్మాతలు కొంతమంది ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు ఫైనాన్స్ కి తీసుకువచ్చి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.

అయితే ఆ ఫైనాన్స్ కట్టడం అనేది లేట్ అయింది అంటే అక్కడ నుంచి ఒత్తిడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఫైనాన్సర్లు ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే చాలామంది నిర్మాతల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా తయారైంది. అసలు సినిమాల పరిస్థితి దారుణంగా తయారయింది. ఒక మంచి ఇమేజ్ ఉన్న హీరో సినిమా విడుదలైనా కూడా థియేటర్లు నిండని పరిస్థితి.

సినిమా సక్సెస్ పై నమ్మకం లేదు

ఈరోజుల్లో ఏ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుంది అనేది ఎవరు ఊహించలేరు కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ స్టామినాను కంప్లీట్ గా చూపించాయి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేశాయి. అయితే ఇంకొన్ని సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. వరుణ్ తేజ్ తన కెరియర్ లో ఎన్ని ప్రత్యేకమైన సినిమాలు చేశాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే అతని మట్క సినిమాకి పలుచోట్ల షోలు క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

భారీ రిస్క్ 

ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం అనేది భారీ రిస్కుతో కూడుకున్న పని. చాలామంది ఫైనాన్సర్లు కూడా మన తెలుగు సినిమా నిర్మాతలకు డబ్బులు ఇవ్వకపోవడంతో తెలుగు సినిమా నిర్మాతలు బాలీవుడ్ కంపెనీలను నమ్ముకుంటున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కొన్ని విషయాల్లో ఎంత పర్టికులర్ గా ఉంటాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన అఖండ 2 సినిమా పరిణామం.

వడ్డీలు కట్టలేదు 

కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలైపోతాయి అనుకునే తరుణంలో దూకుడు సినిమా టైమ్ నుంచి ఉన్న లావాదేవీలు సెటిల్ కాని కారణంగా చివరి నిమిషంలో షోలు ఆగిపోయాయి. ఆ తరుణంలో నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని సందర్భాల్లో మన ఊహకు కూడా అందదు. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీలు విషయంలో కూడా వడ్డీలు సరిగ్గా పే చేయలేదు అనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దాదాపు తొమ్మిది నుంచి పది కోట్ల వరకు వడ్డీలను నిర్మాతలు క్లియర్ చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాలులో టాపిక్ నడుస్తుంది.

అందుకే వెనక్కి తగ్గుతున్నారు

అయితే కొన్ని సందర్భాలలో సినిమాకి సంబంధించిన హక్కులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు నిర్మాతలు. అయితే ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అది కూడా మరోవైపు అవతల ఫైనాన్షియల్ కి రిస్క్. ఈ పరిణామాలు అన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఫైనాన్సర్లు ఫైనాన్స్ ఇవ్వడానికి వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Aadarsha Kutumbam AK 47 : వెంకీ – గురూజీ మూవీ షూటింగ్ అప్డేట్.. ఎక్కడ చేస్తున్నారంటే?

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×