E-Paper
Advertisement

Sankranti Movies: సంక్రాంతి బ్యాడ్ సెంటిమెంట్‌కు రాజా సాబ్ బలి… ముందే చూసుకోవాలి కదా

Sankranti Movies: సంక్రాంతి బ్యాడ్ సెంటిమెంట్‌కు రాజా సాబ్ బలి… ముందే చూసుకోవాలి కదా

Sankranti Movies : సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ .ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే ఈ బాక్స్ ఆఫీస్ పోటీలో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అందుకోగా, మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సుమారు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక నేటి నుంచి సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైంది. నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

బ్యాడ్ సెంటిమెంట్ కు బలైన రాజా సాబ్…

ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సినిమాలకు సంబంధించిన ఒక బ్యాడ్ సెంటిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యే సినిమాలలో మొదటి సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేక పోతుంది. ఇలా గత కొన్ని ఏళ్లుగా ఈ బాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీని వెంటాడుతూ ఉంది. తాజాగా సంక్రాంతి బ్యాడ్ సెంటిమెంట్ కు రాజా సాబ్ బలైందనే చెప్పాలి. ఇక గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన మొదటి సినిమా ఏది? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? అనే విషయానికి వస్తే..

సంక్రాంతి ఫస్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందేనా?

ఇటీవల కాలంలో ప్రతి సంక్రాంతికి ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీకి అసలు కలిసి రావడం లేదు. 2018 జనవరి 10 వ తేదీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ అజ్ఞాతవాసి’ సినిమా ముందుగా విడుదల అయ్యింది .ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక 2019 జనవరి 11వ తేదీ రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘ వినయ విధేయ రామ’ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. 2020 జనవరి 11 – ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ‘ సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన ఈ సినిమా హిట్ అయింది. 2021 జనవరి 09 న రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘ క్రాక్’ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది.

సంక్రాంతి బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్..

ఇక 2022 జనవరి 14 – ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 12 న బాలకృష్ణ ‘ వీరసింహారెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక 2024 నుంచి విడుదలైన సంక్రాంతి ఫస్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 2024 జనవరి 12వ తేదీ మహేష్ బాబు ‘ గుంటూరు కారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ మిగిల్చింది.. 2015 జనవరి 10వ తేదీ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ మొదట విడుదలయ్యి ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ ఏడాది మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా ముందుగా విడుదల అయింది. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరచడంతో సంక్రాంతి బ్యాడ్ సెంటిమెంట్ కు రాజా సాబ్ బలైందని ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Jananayagan: జననాయగన్ వాయిదా..రీ ఫండ్ లో రికార్డు సాధించిన ‘ బుక్ మై షో’..

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×