E-Paper
Advertisement

Oppo Discount: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై ధర తగ్గింపు.. బెస్ట్ డీల్ ఎక్కడంటే

Oppo Discount: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై ధర తగ్గింపు.. బెస్ట్ డీల్ ఎక్కడంటే
Advertisement

Oppo K13 Turbo| ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీ, అధిక రిజల్యూషన్ కెమెరాతో వస్తుంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో బలమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఒప్పో డివైస్‌పై భారీ డిస్కొంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో కొనుగోలుదారులు మరింత సేవింగ్స్ చేసుకోవచ్చు.

ఒప్పో K13 టర్బో ధర, అందుబాటులో ఉన్న డీల్స్

ఒప్పో K13 టర్బోలో 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అమెజాన్‌లో ఈ వేరియంట్ ధర రూ. 25,198. ఒరిజినల్ లాంచ్ ధర రూ. 27,999. అంటే డైరెక్ట్ ధర తగ్గింపు రూ.2,700.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు సేవింగ్స్

Advertisement

స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే.. 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. గరిష్టంగా రూ. 1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ధర ఫోన్. రూ. 23,938 అవుతుంది. అంటే మొత్తంగా రూ.4200 డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో మరింత ప్రయోజనం

అమెజాన్‌లో ఒప్పో K13 టర్బోపై ఎక్స్‌చేంజ్ ఆప్షన్ ఉంది. పాత ఫోన్ ఇచ్చి గరిష్టంగా రూ. 23,800 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ వాల్యూ ఫోన్ కండీషన్, మోడల్, ఫంక్షనాలిటీపై ఆధారపడి ఉంటుంది.

పెద్ద AMOLED డిస్‌ప్లే, స్మూత్ రిఫ్రెష్ రేట్

Advertisement

ఒప్పో K13 టర్బోలో 6.80 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1280 x 2800 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 1,600 నిట్స్ వరకు వస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ చిప్‌సెట్ మల్టీటాస్కింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. బాక్స్‌లోనే ఆండ్రాయిడ్ 15, కలర్ OS 15 ఇంటర్‌ఫేస్ ఉన్నాయి.

భారీ 7000mAh బ్యాటరీ

ఒప్పో K13 టర్బోలో 7,000mAh భారీ బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకే చార్జ్‌పై ఎక్కువ కాలం వాడుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ వల్ల డౌన్ టైమ్ తక్కువ అవుతుంది.

రోజువారీ ఫొటోగ్రఫీకి కెమెరా సెటప్

రియర్ కెమెరాలో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. f/1.8 అపర్చర్ ఉంది. సెకండరీ 2MP కెమెరా డెప్త్ ఫొటోగ్రఫీకి సహాయపడుతుంది. దీనికి f/2.4 అపర్చర్ ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఫ్రంట్ కెమెరా

ఈ ఒప్పో ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. f/2.4 అపర్చర్ ఉంది. మంచి లైటింగ్‌లో సెల్ఫీలు స్పష్టంగా వస్తాయి. వీడియో కాల్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి.

ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు

ఒప్పో K13 టర్బో 5G, 4G నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. వై-ఫై 7తో వేగవంతమైన వైర్‌లెస్ పనితీరు ఉంది. బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Also Read: జియో సూపర్ వ్యాల్యూ ప్లాన్.. 10+ ఓటీటీ యాప్స్ ఫ్రీ, అన్‌లిమిటెడ్ కాల్స్

ఒప్పో K13 టర్బో కొనడానికి ఇదే డీల్

ప్రస్తుత డిస్కౌంట్ వల్ల ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. హెవీ యూజర్లు, గేమర్లకు భారీ బ్యాటరీ సరిపడుతుంది. AMOLED డిస్‌ప్లే ఫోన్ లో వీడియో వ్యూ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. ఈ సెగ్మెంట్‌లో కెమెరా, పర్‌ఫామెన్స్ తో ఒప్పో K13 టర్బో మిగతా ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×