E-Paper
Advertisement

The Raja Saab : ‘రాజా సాబ్ ‘ మూవీని అసలు ఎందుకు చూడాలి.. 5 ప్రధాన అంశాలు..!

The Raja Saab : ‘రాజా సాబ్ ‘ మూవీని అసలు ఎందుకు చూడాలి.. 5 ప్రధాన అంశాలు..!
Advertisement

The Raja Saab : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ఏడాదిన్నర గా ఎదురుచూస్తున్న మూవీ రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చేసింది.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్గా నటించారు. ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ మూవీకి టికెట్ ధరల్లో భారీ హైక్ దక్కింది, ప్రీమియర్స్‌కి పర్మిషన్లు వచ్చాయి.. ఇవాళ ప్రీమియర్ షోలు పడుతున్నాయి.. ఏపీలో మొదటి షో పడిపోయింది.. కానీ తెలంగాణలో ఇంకా షోలు పడలేదు.. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఈ మూవీ ఎందుకు చూడాలి అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అసలు ఈ సినిమాను థియేటర్లలోనే ఎందుకు చూడాలి..? ఐదు ప్రధాన అంశాలు ఏవో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

‘రాజా సాబ్ ‘ ను చూడటానికి ఐదు ప్రధాన అంశాలు.. 

ప్రభాస్ వింటేజ్ లుక్…

గతంలో ఎన్నడు కనిపించని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో వచ్చినవే.. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ముగ్గురు తో కలిపి ఒక రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది అది ప్రేక్షకుల నుంచి ఎంత మంచి రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

భారీ సెట్…

Advertisement

మామూలుగానే ప్రభాస్ సినిమాలంటే భారీ సెట్లు ఉంటాయి.. బాహుబలి, కల్కి లాంటి సినిమాలలో పెద్ద సెట్లలో షూటింగ్ జరిగింది.. అదేవిధంగా ఈ సినిమాకి కూడా భారీ సెట్ ను ఏర్పాటు చేశారు.. దాదాపు 40వేల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెట్, భారతదేశంలో హారర్ జోనర్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్‌గా రికార్డ్ సృష్టించింది.. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఈ సెట్ ను డిజైన్ చేశారు.. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ సెట్ పై దాదాపు చాలా వరకు షూటింగ్ చేశారు..

ఆకట్టుకొనే వీఎఫ్ఎక్స్.. 

కామెడీ, హారర్ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ ఈ మూవీలో కేవలం కామెడీ సీన్లు మాత్రమే కాదు.. భారీ వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.. సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్రయూనిట్ వెల్లడించింది..

రన్ టైం.. 

Advertisement

సాధారణంగా ప్రభాస్ నటించిన ఈ సినిమాకే నా రన్ టైం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాకి కూడా రన్ టైం ఎక్కువగానే ఉంది. దాదాపు190 నిమిషాలు నిడివి రన్ టైం ఉంటుంది.. 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు సెన్సార్‌ సభ్యులు.. సినిమా మొత్తం బాగుందని సెన్సార్ రిపోర్టులో వెల్లడించారు.

23 కోట్లతో మొసలి సీన్‌..

ఈ సినిమాలో కామెడీ, హారర్ మాత్రమే కాదు.. ప్రభాస్ ముసలితో ఫైట్ చేసే సీన్ సినిమాకు హైలెట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించారు. అయితే ఈ ఒక్క సీన్‌ కోసమే దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్‌ కోసం హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి ఉంటుందట.. దాదాపు మూడు రోజులు పాటు ఆ సీన్ చేసినట్లు తెలిపారు.

Also Read : ‘రాజా సాబ్ ‘ ట్విట్టర్ రివ్యూ..బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?

ఇక ఈ సినిమా బడ్జెట్ విషయం అందరికీ తెలిసిందే.. పిపుల్స్‌ మీడియా దాదాపు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేసిందట.. ఇందులో ఎక్కువగా స్టార్స్ నటించడంతో రెమ్యూనరేషన్ ఎక్కువ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి… పైన తెలిపిన వాటిని చూడాలంటే ఈ సినిమాను తప్పక చూడాలి..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×