E-Paper
Advertisement

Sankranti Winner: సంక్రాంతి బరిలో 5 సినిమాలు… లాభాలు మాత్రం ఒక్క సినిమాకే

Sankranti Winner: సంక్రాంతి బరిలో 5 సినిమాలు… లాభాలు మాత్రం ఒక్క సినిమాకే
Advertisement

Sankranti Winner: సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్ద పండగ. ప్రతి ఏడాది ఈ పండుగకు థియేటర్లు కిటకిటలాడతాయి. స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలవుతాయి. ఈ సంక్రాంతికీ అదే జరిగింది. ఏకంగా ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటిలో అన్ని సినిమాలు ఒకే స్థాయిలో విజయం సాధించలేదు. కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకోగా, కొన్ని సినిమాలు కలెక్షన్లలో వెనుకబడ్డాయి.

ఈ ఐదు సినిమాల్లో మూడు సినిమాలను హిట్‌గా నిలిచాయి. అవి నారి నారి నడుమ మురారి, మన శంకర వర ప్రసాద్ గారు,అనగానగ ఒక రాజు. ఇక మిగతా రెండు సినిమాల్లో ది రాజా సాబ్ డిజాస్టర్ గా మిగలగా.. భర్త మహాసేయులకు విజ్ఞప్తి యవరేజ్ గా మిగిలింది. అయితే వీటిలో అత్యధిక లాభాలు మాత్రం ఒక్క సినిమాకే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన.. అనగానగ ఒక రాజు.

Advertisement

ముందుగా అనగానగ ఒక రాజు గురించి మాట్లాడుకుంటే…ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు బాగా లాభాలు తెచ్చిపెట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి వచ్చారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు మంచి ఫలితాలు వచ్చాయి. థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీ..శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతకు సుమారు 25 నుంచి 30 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు సమాచారం. ఈ సంక్రాంతిలో బెస్ట్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.

ఇక మన శంకర్ వర ప్రసాద్ విషయానికి వస్తే, ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి. రికార్డుల ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. కానీ అసలు లెక్కల్లోకి వస్తే నిర్మాతలు ఇప్పటికీ సేఫ్ జోన్ దాకానే వచ్చారని ఇండస్ట్రీ టాక్. పెద్దగా లాభాలు వచ్చే అవకాశం మాత్రం తక్కువగానే ఉందని అంటున్నారు.

Advertisement

మరోపక్క.. శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి.. సినిమా అవుట్ అండ్ అవుట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్.. వినిపించింది. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడం, థియేటర్లు తక్కువగా దొరకడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యేలోపే.. మొదటివారాల్లో నష్టం జరిగిపోయింది. అయినా ప్రస్తుతం ఈ సినిమా సేఫ్ జోన్‌లో ఉంది. మరికొన్ని వారాలు ఇలాగే నడిస్తే చిన్నపాటి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మిగిలిన రెండు సినిమాలు రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి..మాత్రం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. మొత్తం మీద ఈ సంక్రాంతి సీజన్ నైజాం ఏరియాలో.. సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకు మాత్రం బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా అనగానగ ఒక రాజు భారీ లాభాలు తీసుకురాగా, మిగిలిన రెండు సినిమాలు కూడా సేఫ్ జోన్‌లోకి రావడం ఆయనకు ప్లస్ అయింది.

ALSO READ: Tollywood: రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిన చిరంజీవి హీరోయిన్!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×