E-Paper
Advertisement

Matter Motors: ఈ ఎలక్ట్రిక్ బైక్ వెరీ వెరీ స్పెషల్, ఏకంగా ఏఐతో పని చేస్తుంది!

Matter Motors: ఈ ఎలక్ట్రిక్ బైక్ వెరీ వెరీ స్పెషల్, ఏకంగా ఏఐతో పని చేస్తుంది!
Advertisement

న్యూఢిల్లీలో జరిగిన టెక్నాలజీ డే 3.0లో మ్యాటర్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. దేశంలో మొట్టమొదటి AI- డిఫైన్ వెహికిల్ (AIDV) ప్లాట్‌ ఫామ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ రంగం మరో లెవల్ కు చేరుకోనుంది. కంప్లీట్ ఈవీ తయారీ కంపెనీ సత్తా చాటేందుకు మ్యాటర్ సంస్థ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. కొత్త AIDV ప్లాట్‌ ఫామ్ హార్డ్‌ వేర్‌ను మాత్రమే కాకుండా, వాహన తయారీలో ఇంటెలిజెన్స్ ను సెంటర్ పాయింట్ గా ఉంచబోతోంది.  చక్కటి పనితీరు, సామర్థ్యం, ​​భద్రత, రన్నింగ్ కాస్ట్ తగ్గించేలా తయారు చేస్తుంది. ఈ ప్లాట్‌ ఫామ్ రాబోయే 36 నుంచి 48 నెలల్లో  దేశంలోని దాదాపు అన్ని టూవీలర్ వాహన విభాగంలో విస్తరించి ఉన్న బైక్స్ కు సపోర్ట్ చేయనుంది.

AIDV ప్రత్యేకత ఏంటంటే?  

AI- డిపైన్ ఈవీల ఉత్పత్తి సమయంలో సాంప్రదాయ యాంత్రికంగా డిఫైన్ చేసిన వాహనాలు (MDVలు) లాక్ పని తీరును సూచిస్తాయి. ఎలక్ట్రానిక్‌గా నిర్వచించబడిన వాహనాలు (EDVలు) ఎలక్ట్రానిక్స్ ద్వారా నియంత్రణను మెరుగుపరుస్తాయి, అయితే,  మ్యాటర్స్ ఏరా లాంటి సాఫ్ట్‌ వేర్ డిఫైన్ వాహనాలు (SDVలు) ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌ల ద్వారా ఫీచర్లు,  లక్షణాలుతో పాటు సొంతంగా తన బిహేవియర్ ను మార్చుకుంటాయి.

Advertisement

AIDVలు ఒక అడుగు ముందుకు వేయనున్నాయి. ఈ వాహనాలకు తెలివితేటలు ఉండబోతున్నాయి. నియంత్రణతో పాటు నిర్ణయాలు తీసుకుంటుంది. రియల్ వరల్డ్ పరిస్థితులను నిరంతరం స్వీకరిస్తాయి. మోటార్లు టార్క్, సామర్థ్యాన్ని డైనమిక్‌గా సర్దుబాటు చేస్తాయి. బ్యాటరీ ఏజింగ్ ను మానిటర్ చేయడంతో పాటు ప్రొటెక్ట్ చేస్తుంది. థర్మల్ వ్యవస్థలు పనితీరు తగ్గకుండా స్ట్రెస్ ను మేనేజ్ చేస్తాయి. బైక్ లోని లోపాలను అంచనా వేస్తుంది. స్వంత ప్రవర్తనను మెరుగుపరుస్తుంది.

ఏరాతో కీలక ముందడుగు

నిజానికి కొత్త మార్పు రాత్రికి రాత్రే రాలేదని మ్యాటర్ వెల్లడించింది. ఈ కంపెనీకి చెందిన ప్రస్తుత ఏరా ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ ఇప్పటికే SDV 1.0 ప్లాట్‌ఫామ్‌ మీద తయారైంది. ఇండియన్ టూవీలర్స్ కోసం పలు కంపెనీలు ఇప్పటికే ఈ ఫ్లాట్ ఫారమ్ మీద వాహనాలు తయారు చేయడం మొదలు పెట్టాయి. వీటిలో రైడర్ ఎంగేజ్‌మెంట్ కోసం హైపర్‌ షిఫ్ట్ గేర్‌ బాక్స్, థర్మల్ పరిమితులను అధిగమించడానికి లిక్విడ్ కూల్డ్ మోటార్, బ్యాటరీ సిస్టమ్‌లు, ఫీల్డ్ ఓరియెంటెడ్ కంట్రోల్‌తో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ లాజిక్, రిపేరబిలిటీ, పవర్ డెన్సిటీని మెరుగుపరిచే అధునాతన బ్యాటరీ సెల్, ప్యాక్ ఇంజనీరింగ్ ఉన్నాయి.

 ఐదు సెగ్మెంట్ల ఉత్పత్తికి రోడ్ మ్యాప్  

Advertisement

సాధారణ AI- డిపైన్ హార్డ్‌ వేర్, సాఫ్ట్‌ వేర్, డేటా బ్యాక్ బోన్ గా నిర్మించబడిన మ్యాటర్, రాబోయే నాలుగు సంవత్సరాలలో ఐదు ద్విచక్ర వాహన విభాగాలలోకి విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. నేకెడ్ స్ట్రీట్ మోటార్‌ సైకిళ్లు, స్ట్రీట్ ఫైటర్ మోటార్‌ సైకిళ్లు, అడ్వెంచర్ (ADV) మోటార్‌ సైకిళ్లు, యూత్ ఫోకస్డ్ కమ్యూటర్ మోటార్‌ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురానున్నాయి. ఈ వ్యూహం ఇండియన్ మార్కెట్ లో కంపెనీ సత్తా చాటేందుకు ఉపయోగపడుతాయని మ్యాటర్ అంచనా వేస్తోంది.

Read Also: ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్.. ఒకేసారి 17 ట్రక్కులు లాంచ్ చేసిన టాటా మోటార్స్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×