E-Paper
Advertisement

Actress Fined: అరుణాచలం కొండెక్కిన ప్రముఖ నటి.. జరిమానా విధించిన అధికారులు, ఎందుకంటే?

Actress Fined: అరుణాచలం కొండెక్కిన ప్రముఖ నటి.. జరిమానా విధించిన అధికారులు, ఎందుకంటే?

Actress Fined: ఒక్కొక్కసారి సినీ సెలబ్రిటీలు వినోదం కోసం తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో తెలియదు కానీ వీరు చేసే పనులు అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి. అంతేకాదు ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి కొంతమంది పోలీస్ కేసు ఎదుర్కొన్న వారు కూడా లేకపోలేదు. ఇంకొంతమందిపై అధికారులు జరిమానాలు కూడా విధించారు. అలాంటి వారిలో తాజాగా ఒక నటి ఇప్పుడు రూల్స్ అతిక్రమించి చేసిన పనికి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆమెకు జరిమానా కూడా విధించారు.

ప్రముఖ నటికి జరిమానా..

ఆమె ఎవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి అర్చన రవిచంద్రన్ (Archana Ravichandran). ఇటీవల అర్చన తన కాంబోయే భర్త అరుణ్ ప్రసాద్ తో కలిసి అరుణాచలం వెళ్లింది. అక్కడ తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం వెనుక సుమారుగా 2,668 అడవుల ఎత్తైన కొండ ఉంది. ప్రస్తుతం ఆ కొండ ఎక్కడానికి అటవీశాఖ నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అర్చన రవిచంద్రన్ మాత్రం అక్కడ అధికారుల నుండి అనుమతి తీసుకోకుండా కొండెక్కి అక్కడి నుండి ఫోటోలను తీసి.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా ఇవి కాస్త అధికారుల దృష్టిలో పడ్డాయి. ఇంకేముంది రూల్స్ అతిక్రమించినందుకు నటి అర్చన రవిచంద్రన్ తో పాటు ప్రముఖ నటుడు, అర్చన కాబోయే భర్త అరుణ్ ప్రసాద్(Arun Prasad) లకు జరిమానా రూ.5 వేల చొప్పున అటవీశాఖ అధికారులు విధించారు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు…

ఇక ఇది చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. మీరు వినోదం కోసం ఎక్కే కొండలు ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు అంటూ హెచ్చరిస్తున్నారు. మరికొంతమంది రూల్స్ అతిక్రమించడం తప్పు కదా అంటుంటే.. మరికొంతమంది ఏదో సాహసం చేయాలనుకుంది పాపం చివరికి జరిమానా తప్పలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అర్చన రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్..

1997 నవంబర్ 11న చెన్నై తమిళనాడులో జన్మించింది. సన్ టీవీలో వీడియో జాకీగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కొన్ని టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. అలా ఆల్యా మానసతో కలిసి రాజారాణి 2 అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగ ప్రవేశం చేసింది. ఈ సీరియల్ లో అర్చన పాత్రను పోషించింది. స్టార్ విజయ్ లో ప్రసారమైన మురట్టు సింగిల్స్ షోలో కూడా కనిపించింది. డెమోంట్ కాలనీ 2 ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె… బిగ్బాస్ సీజన్ 7 తమిళ్ లో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచింది. అంతేకాదు భారతదేశంలోని మొత్తం బిగ్ బాస్ బ్రాంచ్ లో తమిళ్ సీరీస్ లో ఈ షో గెలుచుకున్న మొదటి వైల్డ్ కార్డు పోటీదారుగా కూడా నిలిచింది. 2024 లో తన సహ టెలివిజన్ నటుడు అరుణ్ ప్రసాద్ తో రిలేషన్ లో ఉన్నట్టు ప్రకటించిన అర్చన.. గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకుంది.

also read: Border 2: వరుణ్ ధావన్ కి గాయం.. నొప్పి భరించలేకపోతున్నా..వీడియో వైరల్!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×