E-Paper
Advertisement

Tv Serials: బ్యాడ్ న్యూస్.. ఈ టాప్ టీవీ సీరియల్స్‌కు శుభం కార్డు, ఇక చూడలేం!

Tv Serials: బ్యాడ్ న్యూస్.. ఈ టాప్ టీవీ సీరియల్స్‌కు శుభం కార్డు, ఇక చూడలేం!
Advertisement

Tv Serials: ఈ మధ్య టీవీ సీరియల్స్ సినిమాలను మించిన ట్విస్ట్ లతో వస్తున్నాయి. కొన్ని సీరియల్స్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీటికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. కొత్త స్టోరీలు, గ్రాఫిక్స్, లవ్ స్టోరీలతో వస్తున్న సీరియల్స్ విపరీతంగా అలరిస్తున్నాయి. దాంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు ఛానెల్స్ పోటీపడి మరీ కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తున్నాయి.. అయితే కొన్ని ఛానెల్స్ కొత్త సీరియల్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నాయి. దాంతో పాటుగా కొన్ని పాత సీరియల్స్ శుభం కార్డు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు ఛానెల్ జీతెలుగులో ప్రసారం అవుతున్న కొన్ని పాత సీరియల్స్ శుభం కార్డు వేసుకుంటున్నాయని తెలుస్తుంది. మరి ఆ సీరియల్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం..

జీతెలుగులో ముగింపుకు చేరుకున్న టాప్ సీరియల్స్ ఇవే.. 

ముక్కుపుడక.. 

జీతెలుగు ఛానెల్ లో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ముక్కుపుడక ఒకటి.. ఒక సాంప్రదాయక కుటుంబ నేపథ్యంలో వస్తున్న ఈ సీరియల్ జూలై 11 2022 లో ప్రారంభం అయ్యింది. అత్తాకోడళ్ల ఆధిపత్యపోరాటం నేపథ్యంలో వచ్చే సీరియల్స్ కన్నా, ‘ముక్కుపుడక’ కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. వేదవతి అనే ఒక స్త్రీ తనకు వారసురాలిగా అన్నపూర్ణ దేవి యొక్క ముక్కుపుడకని ధరించి, అమ్మవారిని కొలిచి, తన ఊరిని ఆ దేవి ఆగ్రహం నుండి కాపాడే ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అంటుంది. అలానే తెచ్చుకుంటుంది. ఈ సీరియల్ వచ్చి నాలుగేళ్లు అవుతుంది.. దాంతో సీరియల్ కు ముగింపు పలకనున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ రానుందని సమాచారం..

ఉమ్మడి కుటుంబం.. 

Advertisement

బుల్లితెర ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తుంది జీతెలుగు. ఈ మధ్య సూపర్ స్టోరీలతో వచ్చే సీరియల్స్ ఎన్నో వస్తున్నాయి. అలాంటి వాటిలో గత ఏడాది ప్రారంభం అయిన ఉమ్మడి కుటుంబం ఒక్కటి.. సీరియల్ వచ్చి ఏడాది అవుతున్న కూడా సీరియల్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలు అనురాగాలు ప్రేమలు ఎలా ఉంటాయో అన్నది ఈ సీరియల్ స్టోరీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఇకమీదట ప్రసారం కాదు అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తుంది..

దీర్ఘ సుమంగళి భవ.. 

జీతెలుగులో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ఒకటి దీర్ఘ సుమంగళి భవ.. ఈ సీరియల్లో మహీగౌతమి, ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పవన్ రవీంద్ర, శ్రీలక్ష్మి, జాకీ, ఆశారాణి, సుమిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఈ మధ్య ఈ సీరియల్ లో బోరింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో జనాలు పెద్దగా దీన్ని చూడటం లేదని టాక్. అంతేకాదు మధ్యాహ్నం రావడంతో సీరియల్ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయిందని టాక్.. దాంతో ఈ సీరియల్ కు శుభం కార్డు పడబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Advertisement

దీంతోపాటుగా మరికొన్ని సీరియల్స్ కూడా శుభం కార్డు వేసుకోబోతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సీరియల్స్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×