E-Paper
Advertisement

Naveen Polishetty: అప్పటి ‘జాతిరత్నాలు’, ఇప్పటి ‘అనగనగా ఒక రాజు’.. అంతా నవీనే చేశాడు

Naveen Polishetty: అప్పటి ‘జాతిరత్నాలు’, ఇప్పటి ‘అనగనగా ఒక రాజు’.. అంతా నవీనే చేశాడు
Advertisement

Naveen Polishetty: టాలీవుడ్‌లో ఇప్పుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) పేరు బాగా వైరల్ అవుతోంది. రీసెంట్‌గా వచ్చిన ‘ఫంకీ’ మూవీ రిజల్ట్ చూసిన వారంతా, నవీన్ పొలిశెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సినిమా సక్సెస్‌లో నవీన్ పాత్ర ఎంత ఉంటుందనేది.. ఇప్పుడందరికీ తెలుస్తోంది. అందుకు కారణం మాత్రం కచ్చితంగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘ఫంకీ’ (Funky) చిత్రమే. అదెలా అంటే, ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో దర్శకుడు కె.వి అనుదీప్‌ (KV Anudeep)కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌కు కారణం తనే అనేలా అప్పట్లో మారుమోగింది. కానీ, ఆ సినిమా తర్వాత కె.వి. అనుదీప్ చేసిన ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించలేకపోయింది. దీంతో ‘జాతిరత్నాలు’ సినిమాను తన భుజాన వేసుకుని.. నవీన్ పొలిశెట్టినే కష్టపడ్డాడని, క్రెడిట్ మాత్రం అనుదీప్ కొట్టేశాడనేలా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.

Also Read- Rashmika Mandanna: బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన రష్మిక.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా?

కంటెంట్ వీక్ అయినా..

Advertisement

ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే.. సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ (AOR) సినిమాతో మరో మంచి హిట్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాకు దర్శకుడు వేరే అతను అయినా, మొత్తం నవీన్ పొలిశెట్టినే చేశాడనేలా ఆ మధ్య టాక్ నడిచింది. వాస్తవానికి ఈ సినిమా కథలో పెద్దగా దమ్ము లేకపోయినా, స్క్రీన్ ప్లే సోసోగా ఉన్నా.. కేవలం నవీన్ మార్క్ కామెడీ, ఇమేజ్ వల్లే ఈ చిత్రం కమర్షియల్ విన్నర్‌గా నిలిచింది. కంటెంట్ వీక్ అయినా, తన వన్ మ్యాన్ షోతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో నవీన్ మరోసారి సక్సెస్ అయ్యాడు. గతంలో ‘జాతిరత్నాలు’ హిట్ వెనుక నిర్మాత నాగ్ అశ్విన్ ఒక పిల్లర్‌లా నిలిచిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ విషయంలో మాత్రం క్రెడిట్ అంతా ఒక్క నవీన్‌కే దక్కుతుంది.

Also Read- Rajeev Kanakala: రాజీవ్ కనకాల ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్ ఎలా ఉందంటే?

అనుదీప్ కేవీ పేరుకేనా?

Advertisement

దర్శకుడు అనుదీప్ కేవీ పేరుకే తప్ప.. మ్యాటరేం లేదని మరోసారి ‘ఫంకీ’తో తెలిసిపోయింది. అప్పుడు ‘జాతిరత్నాలు’ కానీ, రీసెంట్‌గా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ కానీ.. ఈ సినిమాలను నిలబెట్టింది, అంతా తానై చూసుకుంది మాత్రం నవీన్ పొలిశెట్టినే. థియేటర్‌కు వచ్చిన ఆడియన్స్‌ను పగలబడి నవ్వించే బాధ్యతను ఆయనే తీసుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు, రెవెన్యూ పరంగా భారీ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లను, నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి చేర్చాయి. దీంతో, ఇది ముమ్మాటికీ నవీన్ పొలిశెట్టి బ్రాండ్ వాల్యూ అని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. ఒక గొప్ప కథ లేకపోయినా.. తన యాక్టింగ్, టైమింగ్‌తో సినిమాను కమర్షియల్ హిట్‌గా మార్చగల అరుదైన నటుడు తాను అని నవీన్ మరోసారి నిరూపించాడు.

Also Read- Action movie OTT : పాసింజర్ తో కారులోనే… ట్యాక్సీ డ్రైవర్ అగచాట్లు… ఐయండిబిలో టాప్ రేటింగ్

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×