E-Paper
Advertisement

Action movie OTT : పాసింజర్ తో కారులోనే… ట్యాక్సీ డ్రైవర్ అగచాట్లు… ఐయండిబిలో టాప్ రేటింగ్

Action movie OTT : పాసింజర్ తో కారులోనే… ట్యాక్సీ డ్రైవర్ అగచాట్లు… ఐయండిబిలో టాప్ రేటింగ్
Advertisement

Action movie OTT : దక్షిణ కొరియాలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. కొరియన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది. 1980 లో జరిగిన ‘క్వాంగ్జూ ఉద్యమం’ గురించి ప్రపంచానికి తెలియజేయడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. అప్పటి మిలిటరీ ప్రభుత్వం చేసిన హింసాకాండను, ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సియోల్‌లో టాక్సీ నడుపుకునే ఒక డ్రైవర్ చుట్టూ స్టోరీ ఉంటుంది. ఒక్క సారి చూస్తే మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

‘ఎ టాక్సీ డ్రైవర్’ (A Taxi Driver) యాక్షన్ మూవీ జాంగ్ హూన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రధాన పాత్రలో సౌత్ కొరియా నటుడు సాంగ్ కాంగ్-హో, జర్మన్ రిపోర్టర్‌గా థామస్ క్రెచ్‌మాన్ నటించారు. ఇది 2017లో దక్షిణ కొరియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కిమ్ అనే డ్రైవర్, సియోల్‌లో టాక్సీ నడుపుకుంటూ తన కూతురిని పోషించుకుంటూ ఉంటాడు. అతను చాలా సాధారణ మనిషి. అతనికి రాజకీయాల గురించి అస్సలు తెలియదు. ఒకరోజు ఒక విదేశీ జర్నలిస్టును క్వాంగ్జూ నగరానికి తీసుకెళ్తే భారీగా డబ్బు వస్తుందని తెలుసుకుని, ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలని కిమ్ ఆ జర్నలిస్టును తన టాక్సీలో ఎక్కించుకుంటాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అప్పటి మిలిటరీ ప్రభుత్వం ప్రజలపై దారుణంగా కాల్పులు జరుపుతుంటుంది. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కిమ్ కళ్లారా చూస్తాడు.

మొదట్లో అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకుని తన ఇంటికి వెళ్ళిపోవాలని కిమ్ ప్రయత్నిస్తాడు. కానీ అక్కడి విద్యార్థులు, సామాన్య ప్రజలు చూపిస్తున్న ధైర్యం, వాళ్ళు పడుతున్న బాధలు చూసి అతని మనసు మారుతుంది. ఆ జర్నలిస్టు షూట్ చేసిన వీడియో ఫుటేజీని బయట ప్రపంచానికి చేరవేస్తేనే అక్కడ జరుగుతున్న దారుణాలు అందరికీ తెలుస్తాయని కిమ్ గ్రహిస్తాడు. ప్రాణాలకు తెగించి, తన టాక్సీలోనే ఆ జర్నలిస్టును మిలిటరీ కళ్ళు గప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అక్కడి కర్ఫ్యూ నుంచి కిమ్ బయట పడతాడా ? జర్నలిస్టును కాపాడతాడా ? అతని విడియోలతో స్టోరీ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. అనేది చాలా ఎమోషనల్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.

Advertisement

Read Also : ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్… నవ్య నాయర్-సౌబిన్ షాహిర్ కాప్ థ్రిల్లర్… ఎక్కడ చూడవచ్చు అంటే?

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×