Pre-Release Dialogues: ఇటీవల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో కొంతమంది సెలబ్రిటీలు చెబుతున్న మాటలు.. సినిమాలోని హీరోల డైలాగ్ కంటే ఎక్కువ హడావుడి చేస్తున్నాయి. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు చెప్పే మాటలు అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత అదే మాటలు ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఇలాంటి అతిగా చేసిన ప్రీ-రిలీజ్ క్లెయిమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అవే మాటలు ప్రేక్షకులకు సరదాగా గుర్తుండిపోయాయి.
ఆదిపురుష్ విడుదలకు ముందు “థియేటర్లలో హనుమాన్ జీ కోసం ఒక సీటు ఖాళీగా వదిలేయండి” అని ఈ సినిమా దర్శకుడు చాలా ఎమోషనల్ అయ్యి మరి చెప్పారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మాట సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది.
థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ ను “బాలీవుడ్‌కు పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్” అని ప్రచారం చేశారు. కానీ హైప్‌కు సినిమా ఫలితం పూర్తిగా తేడాగా నిలిచింది.
కంగువా గురించి “వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమా” అని ముందే అంచనాలు వేశారు. కానీ బాక్సాఫీస్ అంచనాలు అతిగా మారాయి.
లాల్ సింగ్ చద్దాను “రంగ్ దే బసంతి కంటే గొప్ప సినిమ గత 15 ఏళ్లలో బెస్ట్ డ్రామా” అన్నారు. అంచనాలు ఎక్కువయ్యాయి కానీ ప్రేక్షకుల స్పందన ఆశించిన స్థాయిలో రాలేదు.
రాధే శ్యామ్ క్లైమాక్స్ గురించి “టైటానిక్ కంటే గొప్పది” అన్నారు. కానీ ఆ క్లెయిమ్ సినిమా విడుదలతోనే మునిగిపోయింది.
హిమ్మత్‌వాలా కు “వారం రోజుల పాటు హౌస్ ఫుల్.. టికెట్లు దొరకవు” అన్నారు. మొదటి రోజు ఓపెనింగ్ బాగున్నా వెంటనే సినిమా పడిపోయింది. కమల్ హాసన్ థగ్ లైఫ్ ను “నాయకన్ కంటే గొప్ప సినిమా” అన్నారు. ఒక కల్ట్ క్లాసిక్‌తో పోల్చడం చాలా సాహసంగా మారింది.
సికందర్ ను “గజిని కంటే బెటర్” అన్నారు. కానీ ఈ సినిమా గజిని ఎంత కల్ట్ క్లాసిక్ గా మిగిలిందో ఇది అంత డిజాస్టర్ గా మిగిలింది. ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేసిన వార్ 2 ను విడుదలకు ముందే “మన కాలంలోని గొప్ప సినిమాల్లో ఒకటి” అన్నారు. ఆ సినిమా కూడా బోల్తా పడింది.
కొన్నిసార్లు సినిమాల కంటే ముందు వచ్చిన మాటలే ప్రేక్షకులకు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి అని ఈ స్టేట్మెంట్స్ మరోసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది.
ALSO READ: Baahubali: బాహుబలి సినిమా వల్ల ఇంతమంది.. ఇంత బాధ అనుభవించారా..!