E-Paper
Advertisement

Baahubali: బాహుబలి సినిమా వల్ల ఇంతమంది.. ఇంత బాధ అనుభవించారా..!

Baahubali: బాహుబలి సినిమా వల్ల ఇంతమంది.. ఇంత బాధ అనుభవించారా..!
Advertisement

Baahubali: భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి సినిమాకి ఉన్న ప్రత్యేకమైన చోటు గురించి చెప్పనవసరం లేదు. భారీ సెట్లు, శక్తివంతమైన పాత్రలు, హీరోల ఫిజిక్.. ఇలా ఈ సినిమాలోని ప్రతి ఒక్క విషయం కూడా.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కానీ ఈ గొప్ప విజయం వెనక దాగి ఉన్న ఒక నిజం గురించి మనం ఎక్కువగా మాట్లాడం. అదే… నటులు భరించిన శారీరక బాధ. ఈ విషయం ఈ మధ్య వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరిస్తోంది.

బాహుబలి కోసం నటులు సంవత్సరాల పాటు కఠినమైన ఫిట్‌నెస్ రూటీన్లు పాటించారు. బయటకు బలంగా కనిపించిన ఆ సెలబ్రిటీలు, లోపల మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు అంట.

హీరో రానా తో మొదలు..!

Advertisement

ఇటీవల ఒక పోడ్కాస్ట్‌లో తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. గుండె, కిడ్నీకి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల్సి వచ్చిందని, కోలుకునే సమయంలో కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిసింది.

ప్రభాస్ కి కూడా అదే సమస్య..!

బాహుబలి తర్వాత మోకాలి గాయంతో బాధపడ్డారు. ఆ సమస్య చివరికి సర్జరీ వరకు వెళ్లింది. అలాగే, బరువు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక పాత్ర కోసం శరీరాన్ని ఒక తీవ్రమైన.. స్థాయికి తీసుకెళ్లడం ఎంత ప్రమాదమో ఇది చూపిస్తుంది.

Advertisement

అలానే అనుష్క శెట్టి కూడా ఈ ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొన్నారు. బాహుబలి, సైజ్ జీరో సినిమాల మధ్య ఆమె బరువు విపరీతంగా తేడా రావడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఐదేళ్ల పాటు ఒకే రకమైన ఎక్స్‌ట్రీమ్ ఫిజిక్‌ను మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు. నిరంతర ఒత్తిడి, కెమెరాల ముందు పరిపూర్ణంగా కనిపించాలనే భారం..ఇవి అన్నీ శరీరాన్ని లోపల నుంచి దెబ్బతీస్తాయి.

ఇది ఒక్క బాహుబలి టీమ్‌కే పరిమితం కాదు. అమీర్ ఖాన్ గజినీ, దంగల్ కోసం చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్స్.. చాలా ప్రమాదకరం.. అని ఆయనే హెచ్చరించారు. దంగల్ కోసం 97 కిలోల వరకు బరువు పెరిగి, ఆ తర్వాత వేగంగా 20 కిలోలు తగ్గారు. ఇప్పటికీ దాని ప్రభావం ఉందని ఆయన చెబుతారు.

ALSO READ: Prabhas: పూరీలా ఎవరూ రాయలేడు.. ‘ఏక్ నిరంజన్’ డైలాగ్స్‌‌ని ఆ సినిమాకు వాడుకున్నారు

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×