E-Paper
Advertisement

‘గాయపడ్డ సింహం’.. కామెడీ సర్కస్సా? లేక ప్రేక్షకులకు టార్చరా?

‘గాయపడ్డ సింహం’.. కామెడీ సర్కస్సా? లేక ప్రేక్షకులకు టార్చరా?
Advertisement

Gaaya Padda Simham:పెళ్లి చూపులతో దర్శకుడిగా కెరీర్ మొదలెట్టిన తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అంటూ రెండో సినిమాతో మంచి పేరునే మూటగట్టుకున్నాడు. మధ్యలో మెగా ఫోన్ వదిలి నటన వైపు దృష్టి పెట్టాడు. ఇక ముచ్చటగా మూడో సారి అంటూ డైరెక్షన్ చేసిన కీడా కోలా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇపుడు రూటు మార్చి ‘హీరో’గా సెటిల్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తుంది.ఈ క్రమంలోనే కశ్యప్ దర్శకత్వంలో తరుణ్ హీరోగా చేసిన ‘గాయపడ్డ సింహం’ రేపు థియేటర్లోకి రాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి నెట్టింట వినిపిస్తున్న కామెంట్స్ సినిమాపై అంచనాలని తుంచేస్తున్నట్టే కనిపిస్తుంది.

స్పూఫ్ ల పేరుతో కాలక్షేపం?

Advertisement

ముఖ్యంగా ఈ మూవీ చుట్టూ చక్కర్లు కొడుతున్న నెగటివ్ బజ్ ఏంటో తెలుసా.. సినిమాలో కథ కన్నా స్పూఫ్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని. అవును.. అర్జున్ రెడ్డి, పోకిరి, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ సినిమాలలోని కల్ట్ సీన్లని తీసుకొని వాటి చుట్టూ పేరడీ ట్రాక్స్ డిజైన్ చేశారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. స్పూఫ్ లంటే అప్పుడెప్పుడో సుడిగాడు టైమ్ లో ఆడియన్స్ ఆదరించారు కాని మారిన ఈ ట్రెండ్ లో అవి ఎంత వరకు వర్కౌట్ అవుతాయో, ఆడియన్స్ వాటిని ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. అసలే సినిమాలు ఏ మాత్రం పాత వాసన కొట్టినా మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు ఆడియన్స్. అలాంటిది ఇలాంటి పాత చింతకాయ పచ్చడిలాంటి, అరిగిపోయిన పేరడీ ట్రాక్స్ అంటూ సినిమాని ఎలా గట్టున పడేస్తారో మేకర్స్ కే తెలియాలి.

ALSO READ :‘కట్’ చెప్పినా హీరోయిన్లను వదలరు.. హీరోల రాసలీలలపై అన్ను కపూర్ హాట్ కామెంట్స్!

Advertisement

ఇక రైటింగ్ పరంగా క్రియేటర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈ పేరడీలకి ఓటేశాడో మరి. ఇక కేవలం తెలుగు సినిమాల స్పూఫ్ లే కాదండోయ్.. కన్నడ సినిమాల స్పూఫ్ లు కూడా ఇందులో పెట్టారట. మరి గాయపడ్డ సింహం అని పేరు పెట్టిన మేకర్స్ సిన్సియర్ ఫిలిమ్ చేస్తున్నారా లేక కామెడీ సర్కస్ దించుతున్నారా అన్నది రిలీజ్ అయితే కాని తెలీదు.

కాస్టింగ్ ఉంది.. కానీ క్యారెక్టర్లు ఉంటాయా?

సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి వంటి అందాల భామలు వారికి కేవలం గ్లామర్ కోసమే దించుతున్నారా లేక ఏమైనా నటించే స్కోప్ ఇచ్చారా అన్నది చూడాలి. ఇక సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ఊరిస్తున్నారు. అయితే, జేడీ లాంటి నటుడిని ఇలాంటి స్పూఫ్ కామెడీ సినిమాలో ఇరికించడం ఎంతవరకు కరెక్టో చూసిన ఆడియన్స్ తేల్చేయాలి.ఇక శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేయడం అంటే అది కేవలం సినిమా మీద హైప్ పెంచడానికే అన్నది ఓపెన్ సీక్రెట్.

బాక్సాఫీస్ దగ్గర నిలబడేనా?

నిజంగానే వినిపిస్తున్నట్టుగా మేకర్స్ గనుక సినిమా నిండా స్పూఫ్ లతో నింపేస్తే మాత్రం సినిమా బయటపడటం కష్టమే. మరి తరుణ్ భాస్కర్ తన ఇమేజ్ ను తానే డ్యామేజ్ చేసుకుంటున్నారా? లేక హీరోగా ప్రూవ్ చేసుకుంటారా? ఈ నాన్ స్టాప్ కామెడీ థియేటర్లో నవ్విస్తుందా లేక తలనొప్పి తెస్తుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ALSO READ :‘కర’ రివ్యూ.. ధనుష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×